గులాబీ జెండా.. తెలంగాణ ప్రజల అండ

Published: Wednesday February 17, 2021
ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ 
 
శేరిలింగంపల్లి, ప్రజాపాలన : 2021- 23 సంవత్సరమునకు గాను తెరాస పార్టీ కార్యకర్తల సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం చందానగర్ నగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ లతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెరాస నాయకులకు, కార్యకర్తలకు సభ్యత్వంను అందచేసారు. ఈ సందర్భంగా సభ్యత్వం నమోదు కారక్రమం గూర్చి గాంధీ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీర్ ఆదేశాల మేరకు తెరాస పార్టీ సభ్యత్వాన్ని ఒక పండుగ వాతావరణం లాగా చేసి తెరాస పార్టీని బలోపేతం చేయాలనీ , రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వంను నమోదు చేసి ముఖ్యమంత్రి కెసిఆర్ కి కానుకగా ఇవ్వాలని అన్నారు. ప్రతి కుటుంబాన్ని పార్టీ సభ్యత్వం కోసం సంప్రదించాలని, సభ్యత్వ రుసుం వారి నుంచే తీసుకోవాలని అదేవిధంగా ఏరోజుకారోజు సభ్యత్వాలను ఆన్ లైన్ చేయాలనీ తెలిపారు. తెరాస పార్టీ  2021- 2023 సంవత్సరమునకు గాను తెరాస పార్టీ కార్యకర్తల సభ్యత్వం కొరకు దరఖాస్తు ఫిబ్రవరి 28 తారీఖు లోపు చేసుకోగలరని, ఇట్టి సభ్యత్వం ద్వారా రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుందని, సాధారణసభ్యత్వానికి 30రూపాయల రుసుము, పార్టీ క్రియాశీల సభ్యత్వం 100 రూపాయల రుసుము ఎస్సీ ఎస్టీ కార్యకర్తలకు 50 రూపాయలు చెల్లించ గలరు అని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు సభ్యత్వం చేసుకునే కార్యకర్తలు ఆధార్ కార్డ్, పాస్ ఫోటో, మొబైల్ నెంబర్, సంతకం కంపల్సరీ అదేవిధంగా ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు ,కార్పొరేటర్లు తెరాస పార్టీ ఆశయాలను ముందుకు తీసుకుపోతూ పార్టీ అభివృద్ధికి అదే విధంగా అన్ని రంగాలలో మన నియోజకవర్గాని ముందుకు తీసుకుపోయేవిధంగా కృషి చేయడానికి, అధిక సంఖ్యలో సభ్యత్వాన్ని చేయించవల్సిందిగాను, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తెరాస నాయకులకు, కార్యకర్తలకు తెరాస పార్టీ సభ్యత్వం ప్రతి కార్యకర్త రెన్యూవల్ చేసుకోవాలని అదేవిధంగా నియోజకవర్గంలోని తెరాస అభిమానులను, పార్టీ కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉన్నవారిని క్రొత్తసభ్యులుగా సభ్యత్వం ఇప్పించాల్సి ఉందని కావున తెరాస నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తెరాస పార్టీ తరుపున చేపట్టబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయగలరని ఎమ్మెల్యే తెలియచేసినారు పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినదని, పార్టీ కోసం కష్టపడినా ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, పార్టీ అభ్యున్నతికి కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు మిరియాల రాఘవరావు, ఉరిటీ వెంకట్రావ్,  వెంకటేష్ ముదిరాజ్, ప్రవీణ్, జనార్దన్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, అక్బర్ ఖాన్, గుడ్ల ధనలక్ష్మి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.