మున్సిపాలిటీ కార్యవర్గ సమావేశం

Published: Thursday July 22, 2021
మధిర, జులై 21, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర పట్టణ, మరియు, రురల్ మండల, కార్యవర్గ సమావేశం, స్థానిక వర్తక సంఘ కల్యాణ మండపంలో, పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్, గుండా చంద్ర శేఖర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్లపల్లి విజయరాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, యర్రబోల్ వేణు గోపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి, మార్సకట్ల స్వర్ణకార్, ఈ సమావేశములో పాల్గొని, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయటం జరిగింది, ఈ కార్యక్రమములో నాయకులు, మాట్లాడుతు, దళిత సాధికారిత పేరుతొ, కెసిఆర్ దళితులనుమరో సారి మోసం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, దళిత సాధికారతకు 1000/కోట్లు కేటాయిస్తాం అని తెలగాణ రాష్ట్రములో ప్రతి నియోజకవర్గానికి 100దళిత కుటుంబాలకు, 10లక్షలు చొప్పున రాష్ట్రములో 119, నియోజికవర్గల్లాలో, ప్రతి నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున 11వేల 900/కోట్ల రూపాయిలు అవసరం మొత్తం తెలంగాణాలో 12వేల 800, గ్రామాలకు గాను గ్రామానికి ఒక దళిత కుటుంబానికే 10లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందామని, రాష్ట్రములో 18% ఉన్న sc వర్గాలను మరొకసారి మోసం చేయాలనీ, హుజురాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని, దళితులను, మోసం చేయటానికి కెసిఆర్ సిద్ధపడ్డాడు, అదేమాదిరిగా మధిర నియోజిక వర్గంలో ప్రజలు కూడ ఇక్కడ ఉప ఎన్నిక జరిగితే,రాష్ట్ర ప్రభుత్వం దళిత సాధికారిత పేరుతొ మధిర నియోజకవర్గంలో ఉన్న దళితులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న sc, st obc, మైనార్టీ, మరియు ఇతర సామజిక వర్గాలకు న్యాయం జరగాలంటే ఇక్కడ ఉన్న స్థానిక mla బట్టి గారు కూడ రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వనుంచి నిధులు రావటానికి సహకరించాలని మధిర నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు, అవంతుగా ఆలోచించాలని బట్టి గార్ని కోరటం జరుగుతుంది.అనంతరం పట్టణ మరియు రురల్ కమిటీ అధ్యర్యంలో నాయకులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలువేరు సాంబశివరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు, సీనియర్ నాయకులు, రామిశెట్టి నాగేశ్వరావు, కోనా నరసింహారావు, పట్టణ కార్యదర్శిలు, పగడాల నాగేంద్రబాబు, బియ్యవరపు రామకృష్ణ, నల్లపు జయపాల్ p ఖాజామియా, D రవీంద్ర, శ్యామ్, మోహనరావు, వంశీ, శ్రీకాంత్,విల్సన్, ప్రదీప్,యలమద్ది  బ్రహ్మం, md గౌస్, తదితరులు పాల్గున్నారు.