మహదేవపురంలో వసుంధర మెడికల్ అండ్ ఫ్యాన్సీ ని ప్రారంభించిన

Published: Friday March 10, 2023
ఎంపీపీ మొండెం లలిత. మధిర రూరల్ మార్చి 9 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడుమహాదేవపురం గ్రామంలో గత 20 సంవత్సరాలుగా ఆర్ఎంపి వృత్తి నిర్వహిస్తూ ప్రజలకు అనేక సేవలందిస్తున్న గోంగూర నాగేశ్వరరావు మహదేవపురం లో ఏర్పాటుచేసిన వసుంధర ఫ్యాన్సీ అండ్ మెడికల్ షాప్ ను ఎంపీపీ మొండెం లలిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోంగూర నాగేశ్వరరావు ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తూ ఈ గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవలు చేపట్టారని వారి సేవలు మరువలేనివని గుర్తు చేశారు అనంతరం ఈ సందర్భంగా ఆర్ఎంపీ డాక్టర్ నాగేశ్వరరావును గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంగారమ్మ, గ్రామ పెద్దలు, రిటైర్డ్ ఉపాధ్యాయులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, కిన్నెర గోపి, మొండెం వెంకన్న, బట్ట స్వామి భూషణం తదితరులు పాల్గొన్నారు.