పోడు భూముల పోరుగర్జన సభను విజయవంతం చేయండి: సీపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ

Published: Friday February 19, 2021

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 18, ప్రజాపాలన: సీపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో వచ్చే నెల 1న భద్రాచలం పట్టణం లో జరుగు పోడు భూముల పోరుగర్జన సభను విజయవంతం చేయాలని సీపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు పిలుపునిచ్చారు. ఈ విషయమై గురువారం మండలంలోని ముత్తాపురం గ్రామంలో జరిగిన మండల స్థాయి సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 30, 40 సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు, ఇతర పేద ప్రజలు సాగు చేేసుకుంటున్న పోడు భూములను కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో లాక్కునే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పోడు భూముల్లో కందకాలు తీయడం నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పీటీసీ వాగబొయిన రామక్క, గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు, పీవైఎల్ రాష్ట్ర నాయకులు పర్శిక రవి, వై వెంకన్న, నరేష్, గడ్డం లాలయ్య, శేఖర్, మంగన్న, పెంటన్న, పూనెెం రంగన్న, భానోత్ లాలు, పీడీఎస్ యుు జిల్లా అధ్యక్షులు కాంపాటి పృథ్వి తదితరులు పాల్గొన్నారు.