విఅర్ఏల మూడవ రోజు సమ్మెకు మద్దతు తెలిపిన విఅర్వోలు

Published: Thursday July 28, 2022

జన్నారం, జూలై 27, ప్రజాపాలన: మండల పరిధిలో బుధవారం జన్నారం తాహసిల్థార్ కార్యాలయం ముందు తమ హక్కుల సాధన కోసం విఅర్ఏలు మూడవ రోజు చేపట్టుతున్న నిరావదిక సమ్మెకు మండల విఅర్వోలు మద్దతు ప్రకటించడం జరిగింది, ఈ సందర్భంగా విఅర్వోలు  మాట్లాడుతూ విఅర్ఏలకు సిఎం కేసిఆర్ ఇచ్చిన హమీల అములుకై తలపెట్టిన నిరావదిక సమ్మెకు స్థానిక తాహసిల్థార్ పరిదిలో సోమవారం ప్రారంభం అయినది, విఅర్ఏ లకు పే, స్కేల్, జివో అమలు చేసే వరకు నిరావదిక సమ్మె కొనసాగుతుందని విఅర్వోలు తెలిపారు, విఅర్ఏ లకు యాబైఐదు సంవత్సరము నిండిన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అర్హత కలిగిన ప్రతి విఅర్ఏ కు ప్రమోషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసారు, ఈ కార్యాక్రమంలో మండల విఅర్ఏ అధ్యక్షుడు జగ్గిషేట్టు రాజశేఖర్, ఉపాధ్యక్షుడు దాసండ్ల రాజలింగు, ప్రధాన కార్యదర్శి కాసారపు శ్రీనివాస్, కోశాధికారి బోడ్డు రాజుకుమార్, ప్రచార కార్యదర్శులు గుమ్ముల శ్రీనివాస్, ముగ ప్రసాద్, మగ్గిడి దేవయ్య, విఅర్వోలు రమేష్, తదితరులు పాల్గొన్నారు.