సామాజిక సేవలో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాగిడి లక్ష్మారెడ్డి

Published: Wednesday April 19, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)
 ఉప్పల్ రింగ్ రోడ్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 20 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు ఉప్పల్ నియోజకవర్గంలో చేపడుతూనే  ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తానమని తెలిపారు. అలాగే ఉచిత మెడికల్ క్యాంపులు ఉచితంగా మందుల పంపిణీ, మహిళా సాధికారతే లక్ష్యంగా ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, కంప్యూటర్ డిజైనింగ్ లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ వర్కర్లు , మరియు నిరుద్యోగులకు జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ కల్పన కల్పించడం, వికలాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేస్తూ, ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని పేద విద్యార్థులకు చేయూతనిస్తూ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పై చదువులు చదువుకోవడానికి విదేశాలు వెళ్లే వారికి చేయూతనిస్తూ వారికి అండగా ఉంటామని  ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలకల నరసింహారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ మైనారిటీస్ చైర్మన్ అబ్దుల్ రషీద్ ఆశు, ఎస్టీ సెల్ చైర్మన్ గణేష్ నాయక్, మేడ్చల్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంజరి సంతోష్,సాయి గౌడ్, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సాయిబాబా, ఉప్పల్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ నరేష్, ఉప్పల్ డివిజన్ మైనారిటీస్ చైర్మన్ గజ్జల రాజు, శ్రావణ్ కుమార్, నిమ్మ సురేందర్ రెడ్డి, పవన్ అరవింద్, విన్నీ, అజయ్, కార్తీక్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.