చిన్న పిల్లల ఆరోగ్య పరిరక్షణపై తల్లులకు అవగాహన సదస్సు

Published: Thursday February 11, 2021
వలిగొండ ప్రజాపాలన: మండలంలోని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వెల్వర్తి గ్రామంలో చిన్నపిల్లల ఆరోగ్య పరిరక్షణపై తల్లులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యాధికారి సుమన్ కళ్యాణ్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య పర్యవేక్షణలో మాతృ సంరక్షణ కూడా ఒక భాగమేనని,తల్లి ఆరోగ్యానికి,బిడ్డ ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందని ఆయన అన్నారు.వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత లేకపోవడం, పౌష్టికాహార లోపం,సరైన సమయంలో పిల్లలకు టీకాలు తీసుకోకపోవడం వల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.పిల్లల సంరక్షణపై ప్రతినెలా పరీక్షించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మురళీధర్,నాశబోయిన నర్సింహ,సాలమ్మ,ఆశా కార్యకర్తలు,తల్లులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area