వీధి లైట్లు ఏర్పాటు చేసి, ఇళ్లకు ఇంటి నెంబర్ కేటాయించాలి.

Published: Tuesday May 25, 2021

బొల్లారం, ప్రజాపాలన ప్రతినిధి : అంబేద్కర్ నగర్ లో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, అలాగే 28 మంది ఇంటి పట్టాలు కలిగిన వారందరికీ ఇంటి నెంబర్ కేటాయించాలని రెండో వార్డు కౌన్సిలర్ వారాల గోపాలమ్మ వెంకటయ్య అన్నారు.. ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారం తో అంబేద్కర్ నగర్ కి సంవత్సరం క్రితం కరెంట్ ఏర్పాటు చేశారని, ఐతే వీధి లైట్స్ లేక రాత్రి వేళల్లో అంబేద్కర్ నగర్ లో అంధకారం నెలకొందని, అందులోను పాములు వస్తున్నాయి ఆమె వాపోయారు, వెంటనే అధికారులు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. అంతేగాకుండా అంబేద్కర్ నగర్ ఏర్పాటయి తొమ్మిది సంవత్సరాల అవుతున్నా ఇంతవరకు ఇంటి నెంబర్ కేటాయించలేదని వెంటనే అధికారులు ఇంటి నెంబర్ కేటాయించాలని ఆమె కోరారు..