యాచారం ఎంఈఓ రామానుజన్ రెడ్డి ని తక్షణమే సస్పెండ్ చేయాలి : బహుజన టీచర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి

Published: Thursday December 09, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 8 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం ఎంఈఓ రామానుజన్ రెడ్డి నవంబర్ 29వ తారీకు మేడిపల్లి పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలలోని వ్యాయామ ఉపాధ్యాయుడు మరియు ఇతర ఉపాధ్యాయులతో స్టాప్ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో చాలా అవమానకరమైన, అనుచితమైన, కుల ఆధిపత్య ధోరణితో ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అగౌరపరిచే విధంగా మాట్లాడారు. అధికారుల మైన మేము చెప్పినట్టు వినకపోతే సీసాలు దించుతాం అని అసభ్యకరమైన పదజాలంతో ఉపాధ్యాయులను అవమాన పరచడం జరిగింది. రామానుజన్ రెడ్డి గతంలో కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో పాటుగా అనేక విధాలుగా ఉపాధ్యాయులను, సిఆర్పీలను ఇబ్బందులకు గురి చేసారు. మాడుగుల, కందుకూర్ మరియు యాచారం మండలాలకు ఎంఈఓ గా వుండి ఉపాధ్యాయులను సంతకాలకు ఇంటి దగ్గరికి పిలుచుకొని సంతకాలు పెడుతున్నారు. విద్యాధికారిగా మూడు మండలాలకు ఇంచార్జ్ గా వుండటం వల్ల ఏ మండలంలో కూడా సంపూర్ణంగా అందుబాటులో ఉండటం లేదు. యాచారం, మాడ్గుల, కందుకూర్ మండలాలలో ఈ విద్యా సంవత్సరం మండల స్థాయి ఉపాధ్యాయ దినోత్సవా లను కూడా ఇప్పటివరకు జరిపించలేదు. ఇలా విధులను నిర్లక్ష్యం చేస్తున్నారనే కారణంచేత గతంలో ఎంఈఓ గా తొలగించడం కూడా జరిగింది. అయినప్పటికీ ఎంఈఓ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేదు. కావున ఇలాంటి కుల ఆధిపత్య, నిర్లక్ష్యపు వైఖరి కలిగినటువంటి రామానుజన్ రెడ్డి గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా విద్యాధికారి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓ ప్రభుత్వ విద్యాధి కారిగా కొనసాగుతూ కుల వివక్ష ధోరణలు మరియు లింగ వివక్ష ధోరణులతో ప్రవర్తించే విద్యాధికారిని ఉద్యోగం నుండి టెర్మినేట్ చేయాలని BTF డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో బి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.యాదగిరి, BTF రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరకుడు దామోదర్ మరియు జిల్లా కార్యదర్శి సాయప్ప గార్లు పాల్గొన్నారు.