స్వరాష్ట్రంలో సుపరిపాలన స్థాపికుడు సీఎం కెసిఆర్

Published: Thursday February 17, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ బ్యూరో 16 ఫిబ్రవరి ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ప్రథమ లక్ష్యంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ సుపరిపాలన స్థాపకుడని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ కొనియాడారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ గూడెం కమల్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దృఢసంకల్పంతో ఉద్యమమే ఊపిరిగా గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉవ్వెత్తున ఎగసిపడి పోరాట ప్రతిమను చూపిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. స్వరాష్ట్రాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని గుర్తు చేశారు. అందరి దీవెనలతో ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని ఆకాంక్షించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా సంక్షోభంలోను సంక్షేమాన్ని అందిస్తున్న పరిపాలనాధక్షుడని అన్నారు. వికారాబాద్ మంండల టిఆర్ఎస్ పార్టీీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామం అభివృద్ధిధి చెందాలనే లక్ష్యంతో పల్లెె ప్రగతిని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, వికారాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.