ఒకేషనల్ విద్యార్థులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ డీఐఈఓ

Published: Wednesday December 15, 2021
కాగజ్ నగర్ డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి : ఈ నెల 20 వ తేదీ నుండి జిల్లాలోని ఒకేషనల్ విద్యార్థులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ నిర్వహించాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలియజేసారు. ఇంటర్ బోర్డు ఆదేశానుసారం ఒకేషనల్ విద్యార్థులకు తరగతుల తో పాటు వృత్యంతర శిక్షణ తప్పనిసరని అందులో భాగంగా ప్రతీ ఒకేషనల్ విద్యార్థి స్థానికంగా కంప్యూటర్ సంస్థలను, వైద్య సంస్థలను, పరిశ్రమలను, బ్యాంకింగ్, ఆన్ లైన్ శిక్షణ మరియు వ్యాపార సముదాయాలను సందర్శించి తమ కోర్సులకు తగిన శిక్షణ పొందాలని అన్నారు. ఒకేషనల్ విద్యార్థులు తరగతి గది పాఠ్యాంశాలతో పాటు ఈ శిక్షణ కొనసాగించాలని అన్నారు. ఒక పూట తరగతులు, మరొక పూట వృత్యంతర శిక్షణ ఉండేట్లు షెడ్యూలు రూపొందించాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసారు. జిల్లా వ్యాప్తంగా 4 ప్రభుత్వ, 3 కేజీవీవీ, 1 గిరిజన సంక్షేమ, 1 ప్రైవేట్ కళాశాలల్లో పలు ఒకేషనల్ గ్రూపులు నడుస్తున్నవని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు నిర్ధారిత తేదీల్లో శిక్షణ తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. సంబంధిత షెడ్యూలు హార్డ్ కాపీని మాధ్యమిక విద్య కార్యాలయంలో సమర్పించాలన్ని ఆదేశించారు.