సెయింట్ జోసెఫ్ పాటశాలలో విద్యార్థుల ఫాన్సీ డ్రెస్ పోటీలు

Published: Friday November 11, 2022
మేడిపల్లి, నవంబరు10 (ప్రజాపాలన ప్రతినిధి)

హబ్సిగూడలోని సెయింట్ జోసెఫ్ పాటశాలలో పిల్లల దినోత్సవాన్ని  పురస్కరించుకొని గురువారం 

విద్యార్థులు ఫాన్సీ డ్రెస్ పోటీలు  నిర్వహించారు. విద్యార్థులు సామాజిక సేవలు అందించే పాత్రలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రైతు, వైద్యులు, జవాన్లు, టీచర్, కార్టూన్స్ తదితర అంశాలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శ్రీమాన్య , హాన, మిస్బా, పుందనీక, ఐశ్వర్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.