అర్హులైన, అప్లై చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి : బిజెపి

Published: Saturday June 19, 2021
బాలపూర్, జూన్ 18, ప్రజాపాలన ప్రతినిధి : రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారికి మాత్రమే కాకుండా, అర్హులైన అందరికీ ఇవ్వాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ పేర్కొన్నారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలి - అందెల వైట్ రేషన్ కార్డుదారులకు ఆరోగ్యశ్రీ అమలు చేయాలి. ఆయుష్మాన్ భారత్ ను వెంటనే తెలంగాణలో అమలు చేయాలి - శ్రీరాములు యాదవ్ డిమాండ్ మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ తో  కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్పొరేషన్ అధ్యక్షులు పెండ్యాల నర్సింహ్మ ఆధ్వర్యంలో నిరసనకు బిజెపి శ్రేణులతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ పాల్గొని కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రేషన్ కార్డులు అఫ్లై చేసుకున్న వారికి మాత్రమే కాకుండా... అర్హులైన అందరికీ ఇవ్వాలన్నారు. తెల్ల రేషన్ కార్డు దారులను ఆరోగ్యశ్రీకి అర్హులుగా గుర్తించాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో వెంటనే అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కి డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీజీ ఇచ్చే ఉచిత రేషన్ బియ్యం పేదలకు పంపిణీ చేయాలంటే అర్హులైన వారికి రేషన్ కార్డులు తప్పక మంజూరు చేయాలన్నారు. కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు కారణంగా దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ ఉచితంగా బియ్యం, ఆహారధాన్యాలు అందిస్తున్నారని గుర్తుచేశారు. అనంతరం మీర్ పేట కార్పొరేషన్ అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ మాట్లాడుతూ.... నిరుపేదలు జీవనం సాగిస్తున్న కూలినాలి చేసుకొని సన్న బియ్యం రేషన్ తీసుకోవాలని తెలంగాణ ప్రజలందరికీ కోరుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుందని కోరుతూ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి, అధికార ప్రతినిధి మద్ది రాజశేఖరరెడ్డి, ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు లీలా రవినాయక్, కార్పొరేటర్లు మోడల బాలకృష్ణ, కీసర హరినాథ్ రెడ్డి, భిక్షపతి చారి, కరుణానిధి, భీమ్ రాజ్, అమర్ నాథ్ రెడ్డి, జీఎస్ సోమేశ్ కుమార్, జేడీ కుమార్, తిరుపతి రెడ్డి, శూల ప్రభాకర్, కార్పొరేషన్ బీజేవైఎం అధ్యక్షుడు ముఖేశ్ యాదవ్, కాశీరామ్ సహా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.