చేయి చేయి కలుపుదాం తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలుపుకుందాం : డా.కోట రాంబాబ

Published: Thursday February 17, 2022
మధిర ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం కాజీ పురం గ్రామం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథి కోటా రాంబాబు హాజరై బుధవారం నాడుతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలుపుకుంధాం కార్యక్రమంలో భాగంగా ప్రోహిబిషన్  ఎక్సయిజ్ శాఖ మధిర వారి ఆద్వర్యంలో ఈ రోజు మధిర మండల పరిథిలో ఖాజిపురం గ్రామంలో పాలిటెక్నిక్ కళాశాల నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా డా.కోట రాంబాబు గారు మాట్లాడుతూ. యువత అందరూ కూడా మాదకద్రవ్యాలుకు దూరంగా వుండాలని, అవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం వుంది అని అన్నారు. మాదక ద్రవ్యాలు అనేక రూపాలలో లభిస్తాయి అని, ఇవి ధూమపానం మద్యపానం కంటే తీవ్రమైన ప్రభావం చూపి వీటి భారిన పడిన వ్యక్తులకు వ్యసనం గా మారి వారిని ప్రమాదకరమైన స్థాయికి తీసుకెళ్తాయి అని అన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న యువత వాటి మత్తులో మునిగి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పూర్తిగా కోల్పోతున్నారు అని, వీరు వాటికి పూర్తిగా భానిసలు అయ్యి నేరాలకు పాల్పడుతున్నారు అని, జ్ఞాపకశక్తి కోల్పోయి చివరకు డిప్రెషన్ కు గురయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని అన్నారు.కావున తల్లితండ్రుల కష్టాన్ని తెలుసుకొని కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆయన అన్నారు... మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో యువత అందరూ కూడా పాలుపంచుకొని మాదకద్రవ్యాలను తరిమి కొట్టి తెలంగాణ లోనే మన మధిరను డ్రగ్స్ ఫ్రీ మండలంగా తీర్చిదిద్దుకోవాలి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సయిజ్ సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ శారవాని రూరల్ ఎస్ఐ ప్రియాంక, కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు...