బిజెపి పార్టీ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ సైనికుల పనిచేయాలి

Published: Friday December 09, 2022
బోనకల్, డిసెంబర్ 08 ప్రజా పాలన ప్రతినిధి : మండలంలోని బిజెపి పార్టీ పటిష్టతకు పాటుపడాలని మధిర అసెంబ్లీ కన్వీనర్, రాష్ట్ర ఎస్టీ మోర్చా ఐటీ సెల్ కన్వీనర్ లు ఏలూరు నాగేశ్వరరావు, బీపీ నాయక్ లు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరరావు, దళిత మోర్చా కార్యదర్శి విజయరాజు, రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ బీ పి నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జంపాల రవి, దళిత మోర్చ ఉపాధ్యక్షులు తాళ్లూరు సురేష్ లు హాజరయ్యారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థాగతంగా బూత్ కమిటీల ఏర్పాటు అనంతరం మండలాలలో పార్టీని బలోపేతం చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్ధంగా ఉండేలా ప్రతి ఒక్కరూ సైనికుల్లా చేయాలన్నారు. దళిత బందు ప్రతి దళితుడికి అందేలా పోరాడుతూ, ధరణి సమస్యలతో పాటు రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, అర్హులకు కొత్త రేషన్ కార్డులు, 
మండలంలోని ప్రతి గ్రామం నుంచి అంతర్గత రోడ్ల నిర్మాణం, పేదలకు పక్కా గృహ నిర్మాణం, గిరిజన బందు, వారికి 10 శాతం రిజర్వేషన్ వంటి పలు రకాల ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలని ఈ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో మండల యువమోర్చా అధ్యక్షులు కాలసాని పరశురాం, ఓ బి సి మండల అధ్యక్షులు మరిదు పరశురాముడు, కిషన్ మోర్చా మండల అధ్యక్షులు వజ్రాల మల్లాచారి, మండల నాయకులు మరీదు నాగేశ్వరావు, బంధం నాగేశ్వరావు, ఆళ్ళపాడు గ్రామ నాయకులు తెల్లబోయిన కొండలరావు, మరీదు భాస్కర్, వివిధ మోర్చాల మండల నాయకులు, బూత్ స్థాయి కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.