పమ్మిలో అంబేద్కర్ విగ్రహం మాయం..

Published: Wednesday February 02, 2022
తాసిల్దార్ కార్యాలయంలో దర్శనం మండలంలో అంబేద్కర్ విగ్రహంతొరాస్తారోకో నిర్వహించిన దళిత సంఘంలు 
పాలేరు ఫిబ్రవరి 1 ప్రజా పాలన ప్రతినిధి : ముదిగొండ:భారత రాజ్యాంగ నిర్మాత పేదోడి తలరాత,భారతరత్న. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పేదల ఇళ్ల స్థలాల జాగాలో పేదల దేవుడైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహంను ఆగ్రామ యువకులు నెలకొల్ప గా కొందరు దుండగులు తొలగించి అవమానం చేసిన ఘటన మండలపరిధిలో పమ్మిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పమ్మి గ్రామ రహదారి పక్కన ఉన్న గుట్టపైన పమ్మి గ్రామ అంబేద్కర్ యూత్ సభ్యులు పేదల ఇళ్ల స్థలాల కోసం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఆస్థలంలో విద్యుత్ శాఖ హైలెవెల్ సబ్స్టేషన్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది.గ్రామంలో నిరుపేద దళిత యువకులైన కొంతమంది ఇళ్లస్థలాల కోసం గత సంవత్సర కాలం నుండి ఆ స్థలం పేదల ఇళ్ల జాగల కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించిన విషయం విదితమే.ఉద్యమ పోరాటాల ఫలితంగా ఆస్థలంలో విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మాణంకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాని, గ్రామంలోని కొంతమంది స్వార్థపూరితమైన ఆలోచన ఉన్న బహుజన వాదం మాది బలహీనవర్గాల వైపు ఉంటామని మాటల్లో చెప్పే ఆచరణలో విరుద్ధంగా కొంతమంది భజనపరులు వివిధ రాజకీయ పార్టీల చెంచా గాళ్లు అగ్రవర్ణాల తొత్తులుగా మారిన కొందరు స్వార్థపూరితమైన ఆలోచనలతో పేదలకు ఇళ్ల స్థలాలు రావద్దంటూ కుట్రతో దుర్మార్గమైన ఆలోచనతో గ్రామంలోని కొందరు మోస కార్లుహస్తంతో పోలీస్ రెవెన్యూ అధికారుల సహకారంతో రాత్రికిరాత్రే గుట్టపైనున్న అంబేద్కర్ విగ్రహాన్ని దొంగలు మాయం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని దొంగలించిన దొంగలు కానరాకుండా చేస్తారు.కాగా తెల్లవారేసరికి మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం దర్శనమివ్వడంవిశేషం.అధికారలు సహకారం లేనిదే అంబేద్కర్ విగ్రహం ఆ స్థలం నుండి తొలగించి దుండగులు ఎమ్మార్వో కార్యాలయంలో ఎందుకు పెడతారు. అలా పెట్టారంటే మండల అధికారుల సహకారం ఖచ్చితంగా ఉందనేది ప్రజల్లో తొలుస్తున్న ప్రశ్న. ఇంతకంటే అంబేద్కర్కి మరో అవమానం మరొకటి లేదని మండలంలోని దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బడుగు బలహీన దళిత జనోద్ధరణకు కోసం సంఘసంస్కర్తగా కృషి చేసి దేశానికి సేవలందించి ఇలవేల్పుగా నిలిచిన స్ఫూర్తి ప్రదాత.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుట్టపై నుంచి తొలగించడం అన్యాయం. అక్రమం ఎంత దగా మండల ప్రభుత్వ అధికారుల హస్తం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా రెవెన్యూ పోలీసు అధికారుల హస్తం లేనిదే అక్కడి నుండి విగ్రహం తొలగించటం సాధ్యం కాదని గ్రామ ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం అక్కడ నుండి తొలగించటం మండలంలో చర్చనీయాంశంగా మారింది. మండలంలో దళిత,బడుగు బలహీనవర్గాల ప్రభుత్వ అధికారులు ఉండికూడా అంబేద్కర్ విగ్రహం తొలగించి అవమానం చేయడం ఏమిటని అధికారుల వైఖరిపై మండల ప్రజలు పలువురు ప్రజా ప్రతినిధులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పలు దళిత సంఘాల మరియు న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ముదిగొండ సెంటర్ లోని కోదాడ ఖమ్మం ప్రధాన రహదారిపై అంబేద్కర్ విగ్రహంతో రాస్తారోకో నిర్వహించారు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చారో అక్కడ పెట్టేంత వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పగిడి కత్తుల ఈదయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మ డేట్ చేయగా పోలీసులు బలవంతంగా పెట్రోల్ బాటిల్ లాక్కొని నీళ్ల క్యాన్ పిచ్చి నీళ్ళు మీద వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సి వై పుల్లయ్య నూకల నాగేశ్వరావు జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు న్యూడెమోక్రసీ నాయకులు అంబేద్కర్ అభిమానులు దళిత సంఘల నాయకులు పాల్గొన్నారు