ముదిరాజుల పై దాడులు ఖండించాలి

Published: Thursday September 22, 2022
రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు అందె బాబయ్య ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 20 సెప్టెంబర్ ప్రజా పాలన : ముదిరాజుల పై దాడులు ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు అందెబాబయ్య ముదిరాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వివేక వాణి పాఠశాల ఆవరణలో జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా పరిధిలోగల నవాబ్ పేట్ మండలంలోని పులుమామిడి గ్రామానికి చెందిన తెలుగు రాఘవేందర్ తల్లిదండ్రులు తెలుగు భారతమ్మ చంద్రయ్య తెలుగు రాఘవేందర్ భార్య గాయత్రీలపై అమానుషంగా విచక్షణ రహితంగా దాడులు చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తెలిపారు. తెలుగు రాఘవేందర్ తనకు ఉన్న ఒకటిన్నర ఎకరా పొలంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు తెలుగు రాఘవేందర్ లేని సమయంలో రాఘవేంద్ర తల్లిదండ్రులను భార్యను అమానుషంగా క్రూరంగా మానవ సమాజానికి సిగ్గుచేటుగా తలవంతులు తెచ్చే విధంగా దాడులు చేయడం హేయమైన చర్య అని చెప్పారు ముదిరాజులు సౌమ్యులు ఎవరితో గొడవకు దిగరని విర్రవీగుతూ వారిపై దాడులు చేయడం అమానుషమని అన్నారు ముదిరాజులు తెగిస్తే తట్టుకోలేరని హెచ్చరించారు ఎస్సై భరత్ రెడ్డి అండదండలతో టీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వంటరి వారిని చూసి చావుకూరల్లోకి వెళ్ళే విధంగా కర్రలతో రాళ్లతో కొట్టారని స్పష్టం చేశారు. దాడులు చేసిన వారిపై 32 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. దాడులు చేసిన వారిలో ఐదుగురు ఉంటే ఇద్దరిపై కేసు నమోదు చేయడం పోలీస్ వ్యవస్థకు మచ్చలా నిలుస్తుందని వెల్లడించారు. దాడులు చేసిన వారిపై చట్టపరంగా శిక్షించకుంటే రాష్ట్రవ్యాప్తం ముదిరాజులందరూ పులుమామిడి గ్రామములో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షుడు సత్యం ముదిరాజ్ ముదిరాజ్ యువసేన రాష్ట్ర కార్యదర్శి దుద్యాల రమేష్ ముదిరాజ్ ముదిరాజ్ యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగతి అశోక్ ముదిరాజ్ కొరివి కృష్ణ స్వామి సేవా సమితి వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు షాపురం అనంతయ్య ముదిరాజ్ వివేకవాణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంగ నాగయ్య ముదిరాజ్ నారాయణపురం మహేంద్ర ముదిరాజ్ నవపేట్ మండల ముదిరాజ్ అధ్యక్షుడు డెక్కమానయ్య ఉపాధ్యక్షుడు నాగభూషణం తదితర ముదిరాజులు పాల్గొన్నారు.