అందని పాఠ్యపుస్తకాలువేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత నేలపైన కూర్చుని చదువుకుంటున్న విద్యార్థ

Published: Tuesday June 28, 2022

మన ఊరు మన బడి 89 పాఠశాలలను ఎంపిక మధిర జూన్ 27 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో ఆదివారం నాడు సమస్యలుగుండంలో ప్రభుత్వ పాఠశాలలు*నియోజకవర్గంలో 249 పాఠశాలలో18,917మందివిద్యార్థులువిద్యార్థులకు 

పేద విద్యార్థులు అత్యధికంగా విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాలలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూల్స్ వలే తీర్చిదిద్దుతామని పాలకుల చెపుతున్న మాటలు ఎండమావిగానే మిగిలిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కొత్తగా చేపట్టిన మన ఊరు మన బడి పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో కూడా ఇప్పటివరకు మౌలిక వసతులు కల్పించలేదు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతుందని ఉపాధ్యాయ సంఘాలు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నాయి. పాఠశాలలు ప్రారంభం నాటికే పుస్తకాలు దుస్తులు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తో పాఠశాలలో ప్రారంభమై రెండు వారాలైనా కూడా ఇప్పటివరకు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయలేదు. దీంతో విద్యార్థులు ఎలా చదువుకోవాలంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది నుండి ఇంగ్లీష్ మీడియం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా పాఠశాలల్లో మౌలిక వసతులు తో పాటు విద్యార్థులకు కూర్చునేందుకు కనీసం బెంచీలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధిర నియోజకవర్గంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 249 ఉన్నాయి  ఈ పాఠశాలల్లో మొత్తం విద్యార్థులు 18,917 మంది చదువుకుంటున్నారు. వీరందరికీ ఇప్పటివరకు ప్రభుత్వం పుస్తకాలు దుస్తులు అందించలేదు. నియోజకవర్గంలో సుమారు 200 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యా వాలంటీర్లు నియమించి వారి ద్వారా విద్యాబోధన చేశారు. ఈ ఏడాది ఇంతవరకు విద్యావలంటీర్లను కూడా ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. దీంతో పలు పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు ఉపాధ్యాయులు కరువయ్యారు. మన ఊరు మనబడి పథకం కింద నియోజకవర్గంలో 89 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో మండలంలో ఒకటి మరియ రెండు స్కూళ్లను ఫైలెట్ పాఠశాలలుగా ఎంపిక చేసి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన పాఠశాలలకు కూడా నామమాత్రంగానే నిధులు మంజూరు కావడంతో ఆ పాఠశాలలో కూడా అరకొరగానే పనులు చేపట్టారు. మధిర మండలంలో మొత్తం 56 పాఠశాలలు ఉండగా వాటిలో  ప్రాథమిక పాఠశాలలు 31  ప్రాథమికోన్నత  పాఠశాలలు 11 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు 14  ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 4300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మధిర మండలంలో 45 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా మన ఊరు మన బడి కింద 21 పాఠశాలలను ఎంపిక చేశారు. ఎర్రుపాలెం మండలంలో మొత్తం 52 పాఠశాలలు ఉండగా వాటిలో ప్రాథమిక పాఠశాల 35 ప్రాథమికోన్నత పాఠశాలలు 8 హై స్కూల్స్ 9 ఉన్నాయి. ఈ పాఠశాలలో మొత్తం 3,216 విద్యార్థులు చదువుకుంటున్నారు మన ఊరు మన బడి కింద 19 పాఠశాల ఎంపిక చేశారు. మండలంలో 40 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోనకల్లు మండలంలో మొత్తం 43 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రాథమిక పాఠశాలలు 32 ప్రాథమికోన్నత పాఠశాల 1 హైస్కూల్స్ 10 ఉన్నాయి. వాటిలో 2731 మంది విద్యార్థులు చదువుతున్నారు. మండలంలో 43 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా మన ఊరు మన బడి కింద పదిహేను పాఠశాలలను ఎంపిక చేశారు. చింతకాని మండలంలో మొత్తం 44 పాఠశాలలు ఉండగా వాటిలో ప్రాథమిక పాఠశాల 30 ప్రాథమికొన్నత  పాఠశాలలు రెండు హైస్కూల్స్ 12 ఉన్నాయి. ఈ పాఠశాలలో మొత్తం 3720 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మండలంలో 36 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా, మన ఊరు మనబడి పథకం కింద 16 పాఠశాల ఏర్పాటు చేశారు. ముదిగొండ మండలంలో మొత్తం 54 పాఠశాలలు ఉండగా అందులో ప్రాథమిక పాఠశాలలో 36 ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు హైస్కూల్స్ 15 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 4950 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మండలంలో 18 పాఠశాలను మన ఊరు మనబడి కింద ఎంపిక చేశారు. మండలంలో 36 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
 
*పాత పుస్తకాలతోనే విద్యాబోధన చేస్తున్నామ్*
 
*వై.కోటారెడ్డి హెచ్.ఎం. బాలికల ప్రాథమిక పాఠశాల మధిర*
 
ప్రభుత్వం విద్యార్థులకు ఇంకా పుస్తకాల  అందించలేదు. పాత పుస్తకాలతోనే విద్యార్థులకు విద్యాబోధన  చేస్తున్నాం!. బడిబాట సందర్భంగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లినప్పుడు పుస్తకాలు యూనిఫాం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో కొంత ఇబ్బంది పడుతున్నాం.త్వరలోనే పుస్తకాలు పంపిణీ చేస్తాంమండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు త్వరలోనే పుస్తకాలు పంపిణీ చేస్తామని మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ తెలిపారు. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం వల్ల పుస్తకాల ముద్రణ కొంత జాప్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలుగు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు త్వరలోనే పుస్తకాలు, యూనిఫాం అందిస్తామని ఆయన వెల్లడించారు.