స్వతంత్ర అనిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్ ను సందర్శించారు మేయర్

Published: Wednesday February 24, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో వీధి కుక్కల సమస్య రోజు రోజుకి పెరిగి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకు మంగళవారం నాడు వీధి కుక్కలను వాటి నియంత్రణ లో భాగంగా స్వతంత్ర అనిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన అనిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్ (Anti Birth Control )ను మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి తో పాటు డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ అధికారులు కలిసి సందర్శించడం జరిగింది. ఆమె అక్కడున్న సంస్థ ప్రతినిధి నీ వాటి పోషణ నిబంధనలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగురుంత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కమీషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, సంస్థ ప్రతినిధి మహాన్విథ్ తదితరులు పాల్గొన్నారు.