ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి * మంచాల్ మండల్ లో పర్యటించిన జడ్పిటిసి మర్

Published: Saturday December 31, 2022

విద్యార్థులకు సరళీతరంగా మైండ్ లో నిలిచే రీతిలో బోధన చేయడానికి గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్, లెర్నింగ్, మెటీరియల్, (టిఎల్ఎం) మేలా కార్యక్రమాన్ని మంచాల మండలం నోముల గ్రామంలో మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన మంచాల జడ్పిటిసి *మర్రి నిత్య నిరంజన్ రెడ్డి గారు* , ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి మేలాల వల్ల వినడం, చూడడం, ప్రత్యక్షంగా పాల్గొనడంలో విద్యార్థులు ఎక్కువగా అవగాహన పొందుతారని అందుకే ఆధునిక పద్ధతిలో బోధనపరికారాలతో పాటాల బోధన వేగవంతమైన అధ్యయనానికి తోడ్పాటును అందిస్తుందన్నారు, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనలో ఎల్లప్పుడూ మార్పు చేసుకోవాలని సూచించారు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు సరిపడ వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు, స్కూల్స్ ప్రారంభించి ఇన్ని నెలలు గడుస్తున్నా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు దుస్తులు అందలేదు, వెంటనే అందచేయాలని సంబంధిత అధికారులకు కోరారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులకు సిలబస్ త్వరగా పూర్తి చేసి మంచి ఫలితాలను వచ్చే విధంగా కృషి చేయాలన్నారు, అదేవిధంగా ఉత్తమ బోధన  పరికరాలు తయారు చేసిన  ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు  సబ్జెక్టు వారిగా బహుమతులు సర్టిఫికెట్లను ఈరోజు  అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటరెడ్డి, గ్రంథాలయ సంస్థ  చైర్ మెన్ సత్తు వెంకట రమణ రెడ్డి, నోముల సర్పంచ్ బాలరాజు,  ఎస్ఎంసి చైర్మన్ పాల్లటి జెగన్, మండల్ లోని ప్రధాన  ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ముఖ్య నాయకులు ,సంబంధిత విద్య  అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.