ఘనంగా ధాత్రి గౌడ్ జన్మదిన వేడుకలు*

Published: Monday April 10, 2023

శేరిలింగంపల్లి ప్రజా పాలన /ఏప్రిల్ 8 న్యూస్ :శేరిలింగంపల్లి బిఆర్ఎస్ నాయకులు ధాత్రి గౌడ్ జన్మదిన వేడుకలు శనివారం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ధాత్రి గౌడ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. ధాత్రి గౌడ్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ జన్మదిన వేడుకలకు బీఆర్ఎస్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, సీనియర్ నాయకులు సంగారెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు బాబు మోహన్ మల్లేష్, అంబేద్కర్ సంఘం నాయకులు రాంబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.