పార్లమెంటు నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి మాల మహానాడు నాయకుల డిమాండ్

Published: Wednesday September 14, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించే నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని బెల్లంపల్లి మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు.
మంగళవారం బెల్లంపల్లి మండలంలో ని రంగపేట గ్రామంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలలు రాజ్యాధికారం కోసం ముందుకు సాగాలనీ,  బెల్లంపల్లి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన మాల మహానాడు కమిటీలు ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా బెల్లంపల్లి మండలం రంగపెట గ్రామంలో  బెల్లంపల్లి మండల అధ్యక్షుడు గా నిచ్చకోల చెంద్రమోహన్ని,  మహిళ విభాగం  అధ్యక్షురాలుగా పట్టి లలితని నియమిచడం జరిగిందని, వారి నియామకం రోజు నుండి అమలులోకి వస్తాయని అన్నారు. మాలలు ఆర్థికంగా వెనుక పడుతున్నారని, మాలల  హక్కుల కోసం పోరాడాలని, అంబేద్కర్  ఆశయాల కోసం ముందుండి నడవాలని పిలుపునిచ్చారు.
  ఈ  కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బని రాజనర్సు, జిల్లా ఉపాధ్యక్షురాలు బోగే రజనీ, జూపాక రాజవ్వ, పులసాని సుగుణ, కడమల్ల అంజి, జూపాక లక్ష్మణ్, నిచ్చకోళ్ల శకుంతల, జబ్బల రవినేశ్, పట్టి బుజ్జి, నరేష్ హరీష్, మల్లమ్మ, సుధాకర్, రాయమల్లు, ఆనంద్, రమేష్,తదితరులు పాల్గొన్నారు.