మిస్సైల్ మాన్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో మాటూరు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి

Published: Tuesday April 19, 2022
మధిర ఏప్రిల్ 18 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో సోమవారం నాడుస్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి పేరు మీదుగా కొంతమంది యువత మిస్సైల్ మాన్ హెల్పింగ్ హాండ్స్  పేరుతో గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా మధిర మండలంలోని మాటూర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ రాయబోయే విద్యార్థులు చక్కని ఫలితాలు సాధించాలని ఆశీర్వదిస్తూపరీక్ష సామాగ్రిని వితరణగా అందించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయి కృష్ణమాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్బంగా ఆర్గనైజేషన్ సభ్యులు కృష్ణ మాట్లాడుతూ మిస్సైల్ మాన్ హెల్పింగ్ హాండ్స్ అనే సంస్థను వడ్రాణపు నరేష్ ప్రారంభించారని తెలియజేశారు. దీనికి సభ్యులందరూ ప్రతినెలా కొంత నగదు జమ చేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం  చేస్తున్నామని తెలియజేస్తూ, భవిష్యత్ లో మీరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనీ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మిస్సైల్ మాన్ హెల్పింగ్ హాండ్స్ వాలంటీర్స్ ఎం రమేష్, కోలా కోటేశ్వరరావు, సోమవరపు గణేష్, వి.కృష్ణ లతోపాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.