కార్పోరేట్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Published: Friday July 08, 2022
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం
వికారాబాద్ బ్యూరో జూలై 07 ప్రజా పాలన :  2022 - 2023 విద్యా సంవత్సరమునకు గాను ఇంటర్మీడియట్ లో ఉచిత విద్యనభ్యసించుట కొరకు కార్పోరేట్ కళాశాలలో ప్రవేశానికి ఎస్.సి. ఎస్.టి, బి.సి, మరియు మైనారిటీ విద్యార్థుల నుండి ఈ నెల 8 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాలం ద్వారా  https://telanganaepass.cgg.gov.in ఈ నెల 08 నుండి 20 వరకు   సంబంధిత దృవ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని
అయన తెలియజేసినారు. ఈ అవకాశం మే,  2022 లో పదవ తరగతిలో ఉత్తీర్ణులు అయి జిపిఎ 7.0 ఆ పైన సాధించిన విద్యార్థులకు మాత్రమే అర్హత ఉంటుందన్నారు.  ఇట్టి కార్పోరేట్ కళాశాలలో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, తెలంగాణ ఆదర్శ పాఠశాలలు, మరియు కస్తుర్బా పాఠశాలలో చదివిన  విద్యార్థులు మాత్రమే అర్హులు. కావున విద్యార్ధిని / విద్యార్థులు  పైన తెలిపిన ప్రకారము ఆన్ లైన్ రిజిస్త్రేషన్ ద్వారా వారి వారి పేర్లు తక్షణమే నమోదు చేసుకోగలరని సూచించారు