నెలాఖరు నాటికి 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలి

Published: Friday December 03, 2021
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 02 డిసెంబర్ ప్రజాపాలన : ఈ నెలాఖరు నాటికి 100 శాతం వాక్సినేషన్ సాధించుటకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. గురువారం వికారాబాద్ జిల్లా డిపిఆర్సి భవనంలో  కోవిడ్ వాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్ పై జరిగిన సమీక్ష సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి e అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాస్క్ ధరించడం, వ్యాక్సిన్ వేసుకోవడం, భౌతిక దూరం పాటించటం వంటి కరోనా నియంత్రణ చర్యలను ప్రజలు కొనసాగించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరొన పైన ఆందోళన పడవద్దని అపోహలు, దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. సంపూర్ణ వ్యాక్సినేషన్ లక్ష్యం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఒమిక్రాన్ వేరియంట్ పై పోరుకు రాష్ట్ర,జిల్లా వైద్య శాఖ సన్నద్ధం కావాలని సూచించారు. దేశంలో ఇప్పటివరకు ఎలాంటి నూతన వేరియంట్ కేసులు నమోదు కాలేదని గుర్తు చేశారు. వాక్సినేషన్ వేసుకోకుండా వెనుకంజ వేస్తున్న ప్రజలను మరింత చైతన్యవంతం చేయాలని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను వాక్సినేషన్ లో భాగస్వాములు చేయాలని వివరించారు. మొదటి, రెండవ విడతలో కోవిడ్ పై బాగా పనిచేసిన వైద్య రంగం సిబ్బందితో పాటు రెవెన్యూ, పంచాయతీ రాజ్, మునిసిపల్, పోలీస్ వారికి అభినందనలు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో రెండవ డోస్ ను ప్రత్యేక క్యాంప్ ల ద్వారా వేగం పెంచాలని సూచించారు. తక్కువ వాక్సినేషన్ ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని స్పష్టం చేశారు. వాక్సిన్ పై అపోహలు వీడాలి, రెండు డోసులు వేసుకుంటే కరోనా రాదని వచ్చిన ప్రమాదం ఉండదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి కోవిడ్ టెస్టులు చేయాలని చెప్పారు. వలస కార్మికులకు తప్పనిసరిగా గుర్తించి వాక్సిన్ వేయాలన్నారు. విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గ్రామాల ప్రజాప్రతినిధులు, ఉపాద్యాయులు, అధికారులు పాఠశాలలు సందర్శించాలని సూచించారు. ముందు ప్రజాప్రతినిధులు అందరూ వాక్సిన్ వేసుకొని ప్రజలలో స్ఫూర్తిని నింపి అవగాహన కల్పించారు. ఆస్పత్రులు, బెడ్లు, ఇతర వివరాలు నిత్యం సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు డిసెంబర్ నెలాఖరుకు కొవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులను 100 శాతం సాధించుటకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ నిరంతరం రాష్ట్రంలో ని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని,అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పంచాయతీ, మున్సిపల్, విద్య, ఆరోగ్యం సహా అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటు లక్ష్యాన్ని చేరాలన్నారు. గ్రామాల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఆశ వర్కర్లు, ఏ ఎన్ ఎం లు, అంగన్ వాడి కార్యకర్తలు, సమన్వయం తో పని చేయాలన్నారు.తక్కువ వాక్సినేషన్ నమోదు అయిన పి హెచ్ సి లపై జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, ఆయా సెంటర్ లను సందర్శించాలన్నారు. వాక్సిన్ పై అపోహలు విడనాడాలని రెండు డోసులు వేసుకుంటే కరోనా రాదని, వచ్చిన ప్రమాదం ఉండదని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఒమైక్రాన్ వేరియంట్, వ్యాక్సినేషన్ పై జిల్లాల వారీగా గౌరవ ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. ఒమైక్రాన్ ను అరికట్టుటకు వ్యాక్సిన్ తో పాటు, ప్రజలు తప్పని సరిగా మాస్క్ దరించడం, కొవిడ్ నిబందనలను పాటించడమే ఏకైక మార్గం అని తెలిపారు. వాక్సినేషన్ ప్రక్రియలో దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందువరుసలో ఉందని,మరింత బాగా పని చేసి పూర్తి లక్ష్యాన్ని సాధించాలన్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో డిసెంబర్ నాటికి 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాలను సాధించుటకు ఆవాసాలు, వార్డులు, సబ్ సెంటర్లు, మున్సిపాలిటీలు, మండలాలు వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని ముందుకు సాగాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయి లో వసతులు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు  మంత్రి  తెలిపారు. అందులో భాగంగా ఏరియా ఆసుపత్రుల అప్ గ్రేడేషన్, రేడియాలజీ ల్యాబ్ లు, పాధాలజీ ల్యాబ్, ఆర్.టి.పి.సి.ఆర్ సెంటర్లు ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించి ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహలలో కోవిడ్ నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన చోట విద్య సంస్థలలో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 100 శాతం లక్ష్యాలను సాధించాలని అధికారులకు సూచించారు. పాఠశాలలలో పనిచేస్తున్న టీచింగ్ , నాన్ టీచింగ్ స్టాప్ లో 90 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి గారు,కలెక్టర్ నిఖిల గారు, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్ గారు,కాలే యాదయ్య గారు, కొప్పుల మహేష్ రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు, రాష్ట్ర విద్యా మౌళిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్ గారు, డిసీసీబీ, డిసిఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు మనోహర్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, మురళి కృష్ణ గారు, అడిషనల్ కలెక్టర్లు మోతిలాల్ గారు, చంద్రయ్య గారు, జిల్లా వైద్యాధికారి తుకారం గారు, విద్యాధికారి రేణుక గారు, ఆయా మండలాల ఎంపీపీ, జడ్పీటీసీ లు, మునిసిపల్ చైర్మన్లు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.