యూనిట్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి.

Published: Thursday June 09, 2022
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
 
మంచిర్యాల బ్యూరో, జూన్ 8,ప్రజాపాలన :
 
 
దళితుబంధు పథకంలో అర్హత పొందిన లబ్దిదారులు తాము పొందిన యూనిట్లను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి అంకిత్, జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రెతో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  వ్యవసాయ రంగంలో విత్తనాలు, ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ షాపుల కొరకు 7 మంది, ఫిష్ పాండ్ కొరకు ఒక్కరు, పౌల్ట్రీ ఫార్మ్ + ఆటో ట్రాలీ కొరకు ఒక్కరు, తయారీ-పరిశ్రమల రంగంలో సిమెంట్ బ్రిక్స్ కొరకు ఒక్కరు, పేపర్ ప్లేట్స్, గ్లాస్ తయారీ యూనిట్ , ఆటో కొరకు ఒక్కరు, సెంట్రిగ్ యూనిట్స్ కొరకు 3 మంది, రిటైల్ & షాప్స్ రంగంలో మినీ సూపర్ బజార్, కిరాణా షాప్, హార్డ్వేర్ ఇతరత్రా వాటి కొరకు 13 మంది, సర్వీస్ , సప్లయి రంగంలో టెంట్ హౌజ్ , డి.టి.ఎస్. సౌండ్ సిస్టమ్ కొరకు 20 మంది, రవాణా రంగంలో గూడ్స్ వెహికల్స్  1 ,మొబైల్ టిఫిన్ సెంటర్ కొరకు 7 మంది, ట్రాక్టర్ & ట్రాలీ కొరకు 10 మంది, హార్వెస్టర్ కొరకు ఇద్దరు లబ్దిదారులతో కూడిన ఒక బృందం , ప్రయాణికుల రవాణా వాహనాల కొరకు 15 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.