వైభవంగా బాబు జగ్జివన్ రామ్ 116 వ జయంతి వేడుకలు

Published: Thursday April 06, 2023

జగిత్యాల, ఏప్రిల్ 05 (ప్రజపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల భావి ఆవరణలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జివన్ రామ్116 వ జయంతి ఉత్సవాలను అంగారంగా వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు దళిత బహుజన సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశ దళిత బహుజన వర్గాల కోసం గొప్ప సంస్కరణలు రూపొందించిన మహా మేధావి అని రక్షణ వ్యవసాయం కార్మిక శాఖలో గొప్ప మార్పులు తెచ్చిన మహానియుడని హక్కుల కోసం నిరంతరం శ్రమించిన శ్రమ జీవుడు బాబు జగ్జివన్ రామ్ అని ఈ సమావేశంలో పేర్కొన్నారు. అనంతరం కులాంతర వివాహాలు చేసుకున్న వారికీ ముగ్గురికి 2లక్ష 50 వేల రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ కలెక్టర్ యాష్మిన్ భాష అడిషనల్ కలెక్టర్స్ లత మకరంద ఎస్పీ ఏగ్గడి భాస్కర్ జిల్లా గ్రంధాలయం చైర్మన్ డా: చంద్రశేఖర్ గౌడ్ డీసీసీ అధ్యక్షుడు వడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉత్సవ కమిటీ కన్వీనర్స్ దూమల రాజు కుమార్ కాయితి శంకర్ కొంగర పవన్ బాబు కారంగుల వసంతరావు దుమాల గంగారాం చిత్తరి ప్రభాకర్ నకుమాల్లా లక్ష్మీనారాయణ బాలే శంకర్ బండ శంకర్ జిల్లా సంక్షేమ అధికారి రాజ్ కుమార్ మున్సిపల్ ఇంచార్జి చైర్మన్ గోలి శ్రీనివాస్ కౌన్సిలర్స్ బాలే లత మేక పద్మపవన్ నక్క జీవన్ కల్లెపల్లి దుర్గయ్య బిరుదుల లక్ష్మణ్ బోనగిరి దేవయ్య ఉత్సవ కమిటీ కో-కన్వీనర్స్ కార్యదర్శులు కమిటీ మెంబర్స్ దళిత బహుజన వర్గాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.