అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలి

Published: Friday July 22, 2022
దాడికి పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి*వైఎస్ఆర్ టిపి దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు మద్దెల*

మధిర  జులై 21 ప్రజా పాలన ప్రతినిధి భారత్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని రిటైర్డు సిఐ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ మద్దెల ప్రసాద రావు కోరారు. ఖమ్మం జడ్పీ సెంటర్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఖమ్మం జడ్పీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాలు మాల విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు మాట్లాడుతూ  పట్టపగలు అందరూ చూస్తుండగా ఒక ఉన్నాది ఖమ్మం జడ్పీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహన్ని కర్ర తీసుకొని కొడుతూ ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. అటువంటి ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలు సైతం ఎంతో గౌరవిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలను కొంతమంది సంఘవిద్రోహ శక్తులు ధ్వంసం చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయ చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని మేధావులు రాజకీయాలకతీతంగా నాయకులందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు అంబేద్కర్ సంఘాల నాయకులు విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు