ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు

Published: Thursday January 05, 2023
తపస్ జిల్లా మహిళా కార్యదర్శి గీతానందిని
వికారాబాద్ బ్యూరో 04 జనవరి ప్రజా పాలన : ప్రతి ఒక్కరూ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని తపస్ జిల్లా మహిళా కార్యదర్శి గీతానందిని అన్నారు. తపస్ వికారాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తపస్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని మహిళా ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మహిళా కార్యదర్శి గీతా నందిని, శ్రీలత రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించి మహిళా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులందరూ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని విద్యా బోధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు దోమ కమాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, జిల్లా డివిజన్ కన్వీనర్ వై ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు సంగమేశ్వర్, వికారాబాద్ మండల అధ్యక్షులు రాఘవేందర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, గౌరవ అధ్యక్షులు బాలకిషన్, ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, మైపాల్ రెడ్డి,  ప్రేమ్ సింగ్,రమేష్, దివాకర్ శాస్త్రి, రామకృష్ణ, సంతోష్,  అంజిరెడ్డి, ప్రవీణ్, రవి, మహిళా ఉపాధ్యాయులు కవిత, ఉమారాణి, సుందరమ్మ, అనురాధ, అంబిక, విజయనిర్మల, స్వరూప, సరస్వతి తదితరులు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర బాధ్యులు దోమ కమాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డికి వికారాబాద్ మండల శాఖ తరపున సన్మానించడం జరిగింది.