*పర్వేద సుజాతకు డాక్టరేట్* *అభినందించిన అవినాష్ రెడ్డి*

Published: Wednesday January 18, 2023

 

*ప్రజాపాలన షాబాద్ ::షాబాద్ మండలానికి చెందిన పర్వేద సుజాతకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది. మండలంలోని ముద్దెంగూడ  గ్రామానికి చెందిన పర్వీద సుజాత ప్రస్తుతం సంగారెడ్డి లోని డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తుంది. స్థానిక పి ఆర్ ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, నగరంలోని కోఠి మహిళా కళాశాలలో డిగ్రీ , ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ పూర్తి చేసిన సుజాత జూనియర్ లెక్చరర్ గా పనిచేసి, ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు.  రాజనీతి శాస్త్రంలోని *అంతర్జాతీయ సంబంధాలపై* పరిశోధనలో చేరిన సుజాత ప్రొఫెసర్ బెంజిమిన్ ఆధ్వర్యంలో *భారత - మయన్మార్ ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య వ్యాపారం - సవాళ్లు, అవకాశాలు* అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్ ను  ప్రధానం చేసింది. *భారత - మైయన్మార్ సంబంధాలపై* భారత దేశంలో పరిశోధన చేసిన మూడవ పరిశోధకురాలుగా సుజాత తన ఘనతను సాధించింది. డాక్టరేట్ పొందిన సుజాత తనకు తన కుటుంబ సభ్యులు, స్థానిక పిఆర్ఆర్ కళాశాల లో చదవడం ఎంతో ప్రోత్కంహాగా నిలిచిందని చెప్పారు. జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి, స్థానిక పిఆర్ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కూర వెంకటయ్య, సర్పంచ్ సుదర్శన్, సహకార సంఘం డైరెక్టర్ నర్సింలు, తదితరులు సుజాతను అభినందించారు*ప్రజాపాలన షాబాద్ ::షాబాద్ మండలానికి చెందిన పర్వేద సుజాతకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది. మండలంలోని ముద్దెంగూడ  గ్రామానికి చెందిన పర్వీద సుజాత ప్రస్తుతం సంగారెడ్డి లోని డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తుంది. స్థానిక పి ఆర్ ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, నగరంలోని కోఠి మహిళా కళాశాలలో డిగ్రీ , ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ పూర్తి చేసిన సుజాత జూనియర్ లెక్చరర్ గా పనిచేసి, ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు.  రాజనీతి శాస్త్రంలోని *అంతర్జాతీయ సంబంధాలపై* పరిశోధనలో చేరిన సుజాత ప్రొఫెసర్ బెంజిమిన్ ఆధ్వర్యంలో *భారత - మయన్మార్ ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య వ్యాపారం - సవాళ్లు, అవకాశాలు* అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్ ను  ప్రధానం చేసింది. *భారత - మైయన్మార్ సంబంధాలపై* భారత దేశంలో పరిశోధన చేసిన మూడవ పరిశోధకురాలుగా సుజాత తన ఘనతను సాధించింది. డాక్టరేట్ పొందిన సుజాత తనకు తన కుటుంబ సభ్యులు, స్థానిక పిఆర్ఆర్ కళాశాల లో చదవడం ఎంతో ప్రోత్కంహాగా నిలిచిందని చెప్పారు. జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి, స్థానిక పిఆర్ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కూర వెంకటయ్య, సర్పంచ్ సుదర్శన్, సహకార సంఘం డైరెక్టర్ నర్సింలు, తదితరులు సుజాతను అభినందించారు