ఉపాధ్యాయ వృత్తిలో పాఠాలు బోధించిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి

Published: Tuesday September 06, 2022
బోనకల్, సెప్టెంబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల నందు సోమవారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా స్వయం పాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించి పాఠశాల నిర్వహణ బాధ్యతలు చేపట్టి సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశ రెండో రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని,డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఒక ఉపాధ్యాయుడు మన రాష్ట్రపతులలో ఒకరు ఉపాధ్యాయుడు కావడం మన దేశ టీచర్లందరికీ గర్వకారణం అని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఆయా పాత్రలలో ప్రతిభ కనపరిచినారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి. రత్నకుమారి, ఎస్ఎంసి చైర్మన్ గుగులోతు నాగేశ్వరావు, సర్పంచ్ భూక్య సైదా నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, శైలజ, విజయలక్ష్మి ,సుశీల, సురేష్, రాఘవచార్యులు, ఝాన్సీ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area