ప్రపంచ రక్త దాతల దినోత్సవం... రక్తదానం.. మహాదానం...

Published: Monday June 14, 2021
3900 పైగా రక్తదాతలను సేకరించిన కటుకం గణేష్
-రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ సామాజిక సేవకుడిగా అవార్డు....
-యువకుల్లో రక్తదానంపై ఉన్న అపోహలను తొలిగించిన గణేష్ ..
-14 సంవత్సరాలుగా సేవలందిస్తున్న గణేష్..
 
ఫోటోరైటప్  యువతలో రక్తదానంపై ఉన్న అపోహలను తొలిగించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. ఇప్పటికి మరికొంత యువతలో ఇంకా అపోహలు తొలిగిపోలేవు. రక్తదాన ఆవశ్యకతను వివరించి రక్తదాతలను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రభుత్వ పక్షాన కూడా కార్యక్రమాలు నిర్వహించారు. గత 14 సంవత్సరాలలో నా విన్నపానికి స్పందించి సకాలంలో రక్తదానం చేసిన దాతలందరికి పేరు పేరున కృతజ్ఞతలు... నా ఆలోచన నా ఆలోచనకనుగుణంగా ముందడుగు వేసిన యువజనుల, స్వచంద సంస్థల సహాయ సహకారాలు మరువరానిది... కటుకం గణేష్.... ప్రాణాలు నిలిపేది రక్తదానం ప్రాణపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించేది రక్తం... అందుకే రక్తదానాన్ని ప్రాణదానంతో సమానమంటారు .... ప్రాణాలు పోసే శక్తి మనకు ఉందా అంతా దైవదీనం..... అంటూ ఎవరైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి నిట్టూరిస్తాము. కానీ ఒక రకంగా ప్రాణంపోసే శక్తి వైద్యులకే కాదు మనకు కూడా ఉందనే విషయాన్ని విస్మరిస్తున్నాము .. రక్తదానంతో ఎందరికో జీవితాలను ఇవ్వగలరనీ, మరెందరికో పునర్జన్మను కల్పించే అవకాశం ఒక రక్తదాతకే ఉందనే విషయాన్ని యువతరం గుర్తించుకోవాలి. రక్తదానంపై నానాటికి యువతలో సరైన అవగాహన లేకపోవడం రక్తదానంపై భయానికి గురవడం ఇంకా ఉంది. కనుకనే ఇప్పటికి ఆపత్సమయాలలో సకాలంలో రక్తం అందక ఎందరో మృత్యువాతకు గురవుతున్నారు. రక్తనిధి కేంద్రాలలో సైతం రక్తం అందుబాటులో లేకపోవడంతో అత్యవసర శస్త్ర చికిత్సల సమయాలలో వైద్యులు సైతం శస్త్రచికిత్స చేసేందుకు నిరాకరిస్తున్నారు. మరి అంతటి మహోన్నత రక్తదానంపై యువతలో అవగాహన కల్పిస్తూ గత 14 సంవత్సరాలలో వేలాది మంది యువతతో రక్తదానం చేయించి రక్తదాన సందానకర్తగా ముందుకు సాగుతున్నాను. కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త కోరుట్ల సిటికేబుల్ రిపోర్టర్ కటుకం గణేష్ 2007 సంవత్సరంలో కోరుట్ల పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రసవ సమయంలో మహిళకు సకాలంలో రక్తం అందక కొట్టుమిట్టాడుతున్నా తరుణంలో ప్రత్యక్షంగా అక్కడే ఉన్న కటుకం గణేష్ చలించి వెంటనే ఓ మిత్రునితో రక్తదానం చేయించి తల్లిబిడ్డల సుఖప్రసవానికి దోహద పడ్డాడు. ఇలాంటి అత్యవసర సందర్భాలలో రక్తదాతలు అందుబాటులో ఉంటే ఎవరి ప్రాణాలైన కాపాడవచ్చనే ఆయన ఆలోచనకు 
బీజం పడింది ఇక్కడే !  
తన ఆలోచనకనుగుణంగా ప్రణాళిక రూపొందించుకున్న గణేష్ పట్టణంలోని యువజన, స్వచ్చంధ సంస్థల సభ్యులను కలిసి రక్తదానంలో వారి భాగస్వామ్యతను తెలియపరచారు. గణేష్ ఆలోచనలకనుగుణంగా పట్టణంలోని యువజన సంఘాల సభ్యులు తమతమ రక్తనమూనా వివరాలను ఆయనకందించారు. రక్తనమూనాలు తెలియని వారికి ల్యాబ్ టెక్నిషియన్ అసోసియేషన్ సహకారంతో రక్త నమూనా పరీక్షలు నిర్వహించారు. ఇలా ఇప్పటికే వందలాది మంది రక్తనమూనా వివరాలను వారి ఫోన్ నంబర్లను సేకరించుకున్న గణేష్. నాటినుండి నేటి వరకు ఎక్కడా రక్తదాతల విషయంలో వెనుకంజ వేయలేదు గణేష్ విన్నపాని కి స్పందించినా ఎందరో యువకులు రక్తదానంపై అవగాహన కల్పించుకుని స్వచ్చందంగా రక్తదానంపై తమ సుముఖతను తెలియపరుస్తూ తమ వివరాలను అందించారు. ఇంతే కాకుండా అత్యవసర శసచికిత్సల సమయంలో, ప్రసవాల ప్రాణదాతలయ్యారు. ఈ ఉద్యమం కోరుట్ల పట్టణానికి పరిమితం కాకుండా మెట్ పల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆర్మూర్, హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు సైతం గణేష్ విన్నపంతో రక్తదానం చేసిన దాతలు కోకొల్లలు.... ఇలా 2007 సంవత్సరంలో గణేష్ ప్రారంభించిన ఈ రక్తదాన ఉద్యమం గడిచిన 14 సంవత్సరాల కాల వ్యవధిలో పలు యువజన, స్వచ్చందదాతల సహకారంతో సుమారు 3900 మందికి పైగా రక్తదానాలు పూర్తయ్యాయంటే ఈదొక అసాధారణ కార్యక్రమం అని అనుకొక తప్పదు. ఇంతట అసాధారణ కార్యక్రమాన్ని చేపట్టి రక్తదాన సంధానకర్తగా తన ఆశయాన్ని నెరవేర్చుకున్న గణేష్ సామాజిక దృక్పథానికి చిహ్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా 2015 సంవత్సరంలో అప్పటి ఆర్థిక శాఖమంత్రి, ఇప్పుడు ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి వర్యులు ఈటెల రాజేందర్ చేతుల మీదుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉత్తమ సామాజిక సేవకుడు 2015 లో అవార్డును అందుకున్నారు, మరియు ప్రొ.జయశంకర్ స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారం, కాళోజి పురస్కారం, గ్రామీణ కళాజ్యోతి జీవిత సాఫల్య పురస్కార అవార్డు,కోరుట్ల కు చెందిన ఈతరం యూత్ ద్వారా బెస్ట్ బ్లేడ్ మోటివెటర్ -2010 అవార్డు,జగిత్యాల కళాశ్రీ వారిచే రాష్ట్ర స్థాయి అవార్డ్,కోరుట్ల కు చెందిన శాంతి యూత్ ద్వారా సామాజిక సేవకుడిగా ఉగాది పురస్కారం, రక్తదానం పై విశేష కృషీ చేస్తూ,యువత లో అవగాహన కల్పించినందుకు ఐ.బి యూత్ వారు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డ్ పురస్కారం, కేరళ హైస్కూల్ వారిచే జీవిత సాఫల్య పురస్కార అవార్డ్, మెట్ పల్లి స్నేహలయ యూత్ ద్వారా రక్తదాన అవార్డ్, జగిత్యాల జిల్లా యువజన సంఘాల సమితి ద్వారా రాష్ట్ర స్థాయి అవార్డ్, ఆహా పౌండేసన్ ద్వారా సినీనటుడు అర్. నర్సింహ మూర్తి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డ్,కోరుట్ల ఒకినోహ మార్షల్ ద్వారా రాష్ట్ర స్థాయి అవార్డ్, అంతేకాకుండా కోరుట్ల పట్టణంలోని రక్తదానంలో చేస్తున్న కృషిని గుర్తించి అతనికి మరెన్నో అవార్డ్ లు కటుకం గణేష్ కు అందించారు .ఇలా ఎన్నో..ఎన్నెన్నో .... అవార్డులను, పురస్కారాలను వివిద స్వచ్చంధ సంస్థల ద్వారా అందుకున్నారు. ఇంకా అదే ఉత్సాహంతో సేవారంగంలో ముందు నిలవడం నిజంగా గర్వకారణం. సాధించాలనే తాపత్రయం ఉంటే అద్భుతాలు సృష్టించగలం అనే నానుడికి తగినట్లు గణేష్ కార్యాచరణ వేలాదిమందికి ప్రాణాలు పోసిందంటే ఈ సందర్భంగా ఆయనను మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే... సామాజిక వేత్త, రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ మాట్లాడుతూ... ఒక మనిషికి అమ్మ జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తాడు, కాబట్టి ప్రతి యువత వయస్సు తో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన యువకుల నుండి 50 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరూ రక్తదానం చెయ్యచ్చు దీని దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒక్కరు రక్తదానం చేసి, మరో ప్రాణి ని కాపాడి మీ జీవిత ధ్యేయాన్ని సాధించాలని, నా విన్నపానికి స్పందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన, రక్తదాతలకు పాధాబివంధనం తెలియజేసారు.....