ఆడపడుచుల ఆనందం కోసం ప్రభుత్వo కృషి

Published: Tuesday October 05, 2021
కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్
కోరుట్ల, అక్టోబర్ 04 (ప్రజాపాలన ప్రతినిధి) : రాష్ట్రంలో నీ ఆడపడుచుల ఆనందం కోసం వారి అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ మహిళలకు అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సోమవారం లోని16 వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్ హాజరయ్యారు. వార్డ్ కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి లతో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని మహిళల పండగ అయిన బతుకమ్మ పండుగకు కేసీఆర్ కానుక గా ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందిస్తున్నారన్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య సేవలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ప్రసవాలను చేసేలా కృషి చేస్తున్నారన్నారు. కెసిఆర్ కిట్టు ను అందించడంతోపాటు పుట్టిన పాపకు డబ్బులు కూడా ఇస్తున్నారని తెలిపారు. పేదింటి ఆడపిల్లలకు పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మీ ద్వారా లక్ష 116 అందించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా అర్హులందరికీ పెన్షన్లను అందించడం జరుగుతుందని తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కృషితో నియోజకవర్గంతో పాటు కోరుట్ల పట్టణంలో అనేక మంది మహిళలకు ప్రభుత్వ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. బతుకమ్మ చీరలను మహిళలు ఆదరించడం చూసి ఇతర పార్టీల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. కెసిఆర్ వెంటే ప్రజలు ఉన్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారి సోహెల్, ఆర్ పి పావని, టిఆర్ఎస్ కోరుట్ల పట్టణ యూత్ ఉపాధ్యక్షుడు బలిజ శివప్రసాద్, వార్డు టిఆర్ఎస్ వార్డు మహిళా అధ్యక్షురాలు గొల్లపల్లి నర్సు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కట్కూరి లింగయ్య, సామల గంగ నరసయ్య, పసుల చిన్నయ్య, మైస రాజేష్, కట్కూరి గణేష్, బలిజ సంతోష్ కుమార్ వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు