తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు

Published: Thursday September 02, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 1, ప్రజాపాలన ప్రతినిధి : ఇటివల కురుస్తున్న వర్షాలతో జిల్లేల గూడ ఎస్ వై ఆర్ గార్డెన్ దగ్గర ఆర్ సి ఐ రొడ్డు పైనుంచి వస్తున్న భారీ నీటి వరద జామ్ అయీ, అటు ఇటు పోయె వాహనదారులు చాలా ఇబ్బందిపడుతున్నారని, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలుసుకొని స్వయంగా వచ్చి పర్యవేక్షించారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లను వెంటనే రోడ్డుపై జామ్ అవుతోన్న నీటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తక్షణమే చర్యలు తీసుకోని రోడ్డు మీద జామ్ అయిన నీటినీ తొలగించి రహదారిని క్లియర్ చేశారు. ప్రజా ప్రతినిధులు ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే అమ్మ సబితమ్మకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, టిఆర్ఎస్ అధ్యక్షులు సిద్ధాల లావణ్య బీరప్ప, ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, మీర్పేట్ పోలీస్ సిబ్బంది, కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, టిఆర్ఎస్ నాయకులు సంరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.