కోరుట్ల సిఐ ప్రవీణ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కోరుట్ల యూత్ కాంగ్రెస్ నాయకులు

Published: Saturday February 25, 2023
కోరుట్ల, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా కోరుట్ల సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన మద్దినేని ప్రవీణ్ కుమార్ ని సిఐ  కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అద్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో  కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మ్యాదరి లక్ష్మణ్, సరికెళ్ల నరేష్, కోరుట్ల మండలం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సైదు గంగాధర్,యూత్ కాంగ్రెస్ నాయకులు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి ముహమ్మద్ నసీర్ లు పాల్గొన్నారు.