వృత్తిలో అంకితమై అసువులు బాసిన జర్నలిస్టు జమీర్

Published: Saturday July 16, 2022
జగిత్యాల, జులై, 15 ( ప్రజాపాలన ప్రతినిధి): ఆకాల వర్షాలతో కుర్రు అనే ద్విపంపై చిక్కుకున్న బోర్నపెళ్లి గ్రామస్థుల వార్త కవరేజ్ కోసం పోయిన ఎన్.టి.వి. వీడియో జర్నలిస్ట్ జమీర్ తాను వస్తున్న కారు వాగులో మంగళవారం రాత్రి 8 గంటల కాలంలో కొట్టుకొనిపోగా ఎట్టకేలకు అందరి నిరీక్షణలను పోగొడుతు శుక్రవారం ఉదయం కారు, జమీర్ మృతదేహం లభ్యమైంది. మంగళవారం కారు గల్లంతైన నుంచి తోటి జర్నలిస్టులు, ఎమ్మెల్యే సంజయ్ తక్షణమే స్పాట్ కు స్వంతంగా కారు నడుపుకొని రాగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ గాలింపు చర్యలను ముమ్ముర పరిచారు. అక్కడి వాతావరణం అనుకూలించని నేపథ్యంలో గాలింపు చర్యలు అంతరాయం ఏర్పడగా తోటి జర్నలిస్టులతోపాటు ఎమ్మెల్యే సంజయ్ అక్కడే ఉండి జర్నలిస్ట్ జమీర్ కోసం సమాచారం కోసం ఎదురు చూశారు. వీరికితోడు జిల్లా కలెక్టర్ రవి, జిల్లా ఎస్పీ సిందుశర్మ ఆదేశాలతో రూరల్ సి ఐ కృష్ణకుమార్ స్పాట్లోనే ఉండి తన బలగాలతోపాటు, సంబంధిత అధికారుల ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చారు. జోరుగా కురుస్తున్న వానలో వర్షానికి, చలికి తట్టుకొంటు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గాలింపు చర్యల్లో వున్నారు. తీరా గురువారం వరద నీటి కష్టాలను తట్టుకొని జర్నలిస్ట్ జమీర్ కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో ఎట్టకేలకు మొదట కారు కనిపించగా అందరి కృషితో కారును బయటకు తీయగా అందులో జర్నలిస్ట్ జమీర్ ఆచూకీ లేకుండా పోయింది. తిరిగి గ్రామస్తుల సహకారంతో ఓ చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్న జమీర్ మృతదేహాన్ని గుర్తించి ప్రణాళిక ప్రకారం మృతదేహాన్ని ఒడ్డుకు తెచ్చారు. తీరా ఉబ్బిపోయిన మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే సంజయ్ తోపాటు జగిత్యాల ప్రెస్ క్లబ్ బాద్యులు, తోటి జర్నలిస్టులు కన్నీటి పర్యంతమయ్యారు. వృత్తిలో పైనుంచి వొత్తిడులను తట్టుకొని అరకొర వేతనాలతో వృత్తిపై నిబద్ధతతో ఇంతటి తెగింపుకు సిద్దమవుతున్న జమీర్ లాంటి జగిత్యాల జర్నలిస్టుల త్యాగాలు చిరకాలం నిలిచివుంటాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన తోటి సన్నిహితులతో చర్చించుకోవడం విశేషం. కాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ తక్షణమే స్పాట్ లోకి వచ్చి అధికారులను అప్రమత్తం చేస్తూ చేసిన సహాయక చర్యలు శుక్రవారం నాటికి జర్నలిస్టు జమీర్ ను కాపడలేకపోయాయి. అయినా మేము ప్రభుత్వం జమీర్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే సంజయ్, మంత్రి కొప్పుల ఈశ్వర్ తన కాన్ఫరెన్స్ కాల్స్ లొనే మాట్లాడడం అందరికి నమ్మకం పెంచింది. ఏదీ ఏమైనా వృత్తిలో నిబద్ధతతో, అంకితభావంతో పనిచేసి తిరిగిరాని లోకల్లోకి తరలి పోయిన  జర్నలిస్టు జమీర్ చిరకాలం గుర్తుండిపోతాడని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లు ప్రకటించారు.