వి.ఆర్.ఏ ల సమ్మెకు టీజేయస్ సంఘీభావం

Published: Thursday July 28, 2022

ఇబ్రహీంపట్నం, జూలై 27 (ప్రజాపాలన ప్రతినిధి):
గత మూడు రోజులుగా ఆర్డీవో కార్యాలయం ముందు, జాతీయ రహదారిపై నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న విఆర్యేలకు తెలంగాణ జన సమితి నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీజేయస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ  విఆర్యేల న్యాయబద్ద డిమాండ్లు అయినా పే స్కెలు ప్రకటించడం, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వడం , 50 ఏళ్ళు దాటిన వారందరి పిల్లలకు ఉద్యోగ బదిలీ చేయడం లాంటివి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని సుంకరుల జీవితాలే ఎంతో బాగున్నాయని, ప్రత్యేక రాష్ట్రం సాధించి కూడా విఆర్యేలకు ఎలాంటి సంతోషం లభించలేదని వాపోయారు. ఇచ్చిన హామీలు సైతం నెరవేర్చలేని కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టకారం అని విఆర్యేల డిమాండ్లు నెరవేరే వరకు తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో వారికి పూర్తి అండగా ఉండటమే కాకుండా అవసరం అయిన పక్షములో న్యాయపోరాటం సైతం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజేయస్ నాయకులు చింతకుంట శంకర్, రెబ్బటి మల్లయ్య యాదవ్, పసునూరి శ్రీనివాస్, కంతి రమేష్, జిల్లాపెల్లి దిలీప్, వన్నెల శశి, కాట దశరథం, కొనమ్మ రాజిరెడ్డి, మైలరపు లక్ష్మణ్,  విఆర్యే జిల్లా జేఏసీ నాయకులు ద్యాగల గంగారాం, సుంకం తిరుపతి, తుమ్మల నాగరాజు, పంగ రాజేశం, డివిజన్ జేఏసీ నాయకులు గోరుమంతుల సుధాకర్, పుర్రె వినోద్, గంగాధర్, రవి, సతీష్, కైలాష్, రాజేందర్, రాధకిషన్, రామరాజు, నరేష్ మరియు డివిజన్ లోని అన్ని గ్రామాల విఆర్యేలు పాల్గొన్నారు.