నాగార్జునసాగర్ గెలుపు ప్రతిపక్షాలకు చెంపపెట్టు...

Published: Monday May 03, 2021
బీజేపీ వాపును చూసి బలుపుగా భావిస్తోంది
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు మాని సహకరించాలి - ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్
 
జగిత్యాల, మే 02 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డా. సంజాయ్ కుమార్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించడంతో ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని అన్నారు. తెరాస ఉద్యమ పార్టీ కేసీఆర్ వెంటే ప్రజలు ఉన్నారని నాగార్జున సాగర్ ఎన్నికల్లో నిజమైందని అన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని చౌకబారు విమర్శలు చేసిన ఇష్టానుసారం మాట్లాడిన ప్రజలు బ్యాలెట్ తో సమాధానం చెప్పారని హితువు పలికారు. కాంగ్రెస్ బీజేపీకి చెందిన కేంద్ర నాయకులు ప్రచారం చేసిన సంక్షేమ పథకాల సర్కారునే ఆదరించారని తెలిపారు. దుబ్బాక ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన బీజేపీ వాపును బలుపుగా భావించిందని హెద్దేవా చేశారు. నాగార్జునసాగర్ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ రాని పరిస్దితి అని సాగర్ ఎన్నికలతో పాటు కార్పోరేషన్లు మున్సిపాలిటీలు సైతం తామే కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. కేసీఆర్ పాలనే రాష్ట్రప్రజలకు శ్రీరామరక్ష అని ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ కండ్లు తెరసి విమర్శలు మాని నిత్యం విమర్శలు చేసే జీవన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు జగిత్యాల రూరల్ వైస్ ఎంపీపీ పాలేపు రాజేంద్రప్రసాద్ మైనారిటీ ఉపాధ్యక్షుడు ముజాహిద్ పట్వారీ తదితరులు పాల్గొన్నారు.