ఎస్సై ఆరోగ్యం పిలుపు

Published: Thursday July 07, 2022

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

కరీంనగర్  జూలై 6 ప్రజాపాలన విలేకరి :
 గ్రామీణ ప్రాంత ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సైదాపూర్  ఎస్సై ఆరోగ్యం పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో  ప్రజలకు సైబర్ నేరాలపై సర్పంచ్ కాయిత రాములు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ...బ్యాంకు లావాదేవీలపై మనకు తెలియని నెంబర్ లపై ఫోన్ కాల్ వస్తే వారికి ఆధార్ కార్డు ,ఏటీఎం వివరాలు చెప్పకూడదని కోరారు. అలాగే బ్యాంకు వారి పేరు చెప్పి ఎవరైనా వ్యక్తిగత వివరాల కోసం ఇబ్బందుల గురి చేస్తే వెయ్యి 9 వందల 30 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు తమ బ్యాంకు ఖాతాల నుండి డబ్బులను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మనకు తెలియని నెంబర్ లపై ఫోన్ కాల్ వస్తే ఎత్తకూడదని ఎత్తిన వారికి వివరాలు చెప్పకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ,ఎంఈఓ కేతీరి నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ మేకల మల్లారెడ్డి, వార్డు సభ్యులు రేగుల సురేష్ ,కొట్ట వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area