రైల్వే కాపర్ వైర్ దోపిడీకి విఫలయత్నం రైల్వే సిబ్బంది అప్రమత్తంతో పరారైన దుండగులు లారీని స

Published: Wednesday October 19, 2022

బోనకల్, అక్టోబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ రైల్వే స్టేషన్ పరిధిలోని ట్రాక్షన్ మెయింటినెన్స్ డిపో లోగల కాపర్ వైర్ ని ఆదివారం రాత్రి దొంగలించేందుకు నలుగురు దొంగలు విఫల యత్నం చేశారు. రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో లారీని వదిలి నలుగురు దుండగులు పారిపోయారు. విశ్వాసనీయ సమాచారం, స్థానికుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... గుర్తుతెలియని నలుగురు దుండగులు A p 31 యు 2979 నెంబర్ గల లారీని తీసుకొని బోనకల్ రైల్వే స్టేషన్ సమీపం వద్దకు వచ్చారు. లారీ తేలికగా వెంటనే వెళ్లేందుకు వీలుగా ట్రాక్షన్ మెయింటినెన్స్ డిపో వద్దనే నిలిపారు. నలుగురు దండగలు ఓ హెచ్ ఈ ఆఫీసులోకి ప్రవేశించారు. నాలుగు బండిల్స్ కాపర వైర్ ని అందులో నుంచి బయట వేశారు. దీంతో అక్కడ నుంచి పెద్దగా శబ్దం రావటంతో రాత్రి సమయంలో వాచ్ మెన్ గా ఉన్న రైల్వే సిబ్బంది గమనించారు. వాచ్ మెన్ వెంటనే కార్యాలయ అధికారులకి సమాచారం అందించారు. వెంటనే అధికారులు అప్రమత్తమై ట్రాక్షన్ మెయింటెనెన్స్ డిపో వద్దకు వెళ్లారు. రైల్వే అధికారులు వస్తున్న విషయాన్ని గమనించిన దుండగులు హిందీలో మాట్లాడుకుంటూ తలో దిక్కుకు పారిపోయారు. స్థానిక రైల్వే అధికారులు రైల్వే ఉన్నతాధికారులకి ఖమ్మం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఖమ్మం రైల్వే పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైల్వే పోలీసులు దొంగల కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. అక్కడ వదిలి వెళ్ళిన లారీని రైల్వే పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. లారీ మీద ఫోన్ నెంబర్ల ఆధారంగా రైల్వే పోలీసులు సమాచారం కోసం ఫోన్ చేయగా తాడేపల్లిగూడెం కి చెందిన విజయ్ అనే వ్యక్తి ఆ లారీ తనదేనని తెలిపారు. అయితే గుర్తు గుర్తుతెలియని దొంగలు పారిపోయారని తెలిపారు.