లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ నెంబర్ వన్ : బెల్లంపల్లి ఏసీపి ఎడ్ల మహ

Published: Monday December 13, 2021
బెల్లంపల్లి: డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : రామగుండం పోలీస్ కమిషనరేట్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్ లో రాజీ మార్గంలో రెండు వందలకు పైగా కేసులు పరిష్కారమై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి సబ్ డివిజన్ మొదటి స్థానంలో ఉందని బెల్లంపల్లి ఏసీపి ఎడ్ల మహేష్ అన్నారు. ఆదివారం నాడు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో కేసుల పేరుతో సంవత్సరాలపాటు కోర్టుల చుట్టూ తిరిగే కక్షిదారుల పాలిట లోక్‌అదాలత్‌ వరంలా మారిందని క్రిమినల్‌ కేసులతోపాటు ప్రీ, లిటిగేషన్‌ కేసుల్లోనూ ఇరువర్గాలకు రాజీ కుదిర్చి శాశ్వత పరిష్కారాన్ని చూపెడుతున్నదని అన్నారు. చిన్నపాటి గొడవల నుంచి ఆర్థిక లావాదేవీలు, భూవివాదాలు, అత్తింటి వేధింపులు, మనోవర్తి, చట్టరీత్యా రాజీకి అర్హత కలిగిన కేసుల్లో పైసా ఖర్చు లేకుండా ఇరువర్గాలకు న్యాయం జరిగేలా కోర్టు ఇచ్చిన అవకాశాన్ని బాధితులకు పోలీసులు వివరించి పరిష్కార మార్గాలను సూచించారని, శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో బెల్లంపల్లి డివిజన్ మొదటి స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసులు, పోలీసు అధికారులు, ప్రత్యేక చొరవ తీసుకుని డివిజన్లోనీ  పోలీసులు, పోలీసు అధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారనీ. ప్రజలు లోక్ అదాలత్ ను ఉపయోగించుకుని కేసులు రాజీ అయ్యేలా చూశారని ఆచొరవఫలితంగానే ఇంత పెద్దఎత్తున కేసులు రాజీ అయ్యాయనీ అన్నారు. ఇందులో ఐ పి సి కేసులు 152, డి డి కేసులు 181, ఈ పిటి కేసులు 1758, మొత్తం 2091, కేసులు పరిష్కరింప బడ్డాయని ఆయన తెలిపారు.