పోడు భూముల సర్వేలో పాల్గొన్న బూర్గంపాడు మండలం జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత. బూర్గంప

Published: Thursday October 20, 2022

బూర్గంపాడు మండలం కోయగూడెం పంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ సభ్యులు .&  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగాకాంతారావు ఆదేశాల మేరకు బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోడు భూముల సర్వేలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి సహాయ సహకారాలు అందించడంతో పోడు భూముల సర్వేలో పాల్గొన్న బూర్గంపాడు మండలం జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత . ..ఈ సందర్భంగా బూర్గంపాడు పాడు మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత  మాట్లాడుతూ పోడు భూమలు సాగు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పోడు పట్టాలు అందుతాయని అన్నారు. పోడు సాగుదారులకు హక్కు కలుగుతుందని .అర్హులైన పోడు  సాగుదారులకు పట్టాలు మంజూరు చేస్తారని,, పట్టాలు వచ్చిన రైతులకు రైతుబంధు పథకం అమలు చేయడం జరుగుతుందన అన్నారు . పోడు భూముల సమస్య పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగాకాంతారావు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని అనేకసార్లు సమస్యలను సీఎం కి వివరించడం జరిగిందని . దీంతో సీఎం కేసీఆర్  నిర్ణయం ప్రకారం పోడు సర్వే జరుగుతుందన్నారు .త్వరలోనే సర్వే పూర్తి అవుతుందని పోడు సాగుదారులు ధైర్యంగా ఉండాలని అన్నారు . ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తుపాకులు రామలక్ష్మి ..బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి ,. .  టౌన్ యూత్ అధ్యక్షులు సోము లక్ష్మి చైతన్య రెడ్డి ,  నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్  పూర్ణచందర్ ,.గ్రామ పెద్దలు తుపాకులు రవి ,. ఉద్యమకారులు పోడియం నరేందర్.,  ఏఫ్ఆర్ సి కమిటీ సభ్యులు. అటవీశాఖ అధికారు, గ్రామ పెద్దలు. గ్రామస్తులు. పోడు రైతులు.. బిఆర్ స్ పార్టీ నాయకులు.. కార్యకర్తలు.. తదితరులు పాల్గొన్నారు..