ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి ఎస్టియుటిస్ జిల్లా అధ్యక్షులు సంజీవ్ కుమార్

Published: Monday July 04, 2022
జాక్టో ఆధ్వర్యంలో డీఎస్సీ ముట్టడి **
 
ఆసిఫాబాద్ జిల్లా జులై 03 (ప్రజాపాలన ప్రతినిధి) : దీర్ఘకాలికంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల అధికారం కోసం జాక్టో ఆధ్వర్యంలో రేపు జూలై 5న రాష్ట్ర "జాక్టో స్టీరింగ్ కమిటీ" మేరకు ఆదివారం ఎస్టియు భవన్ లో జాక్టో నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ టి యు టి ఎస్  జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంజీవ్ కుమార్, తుకారాం లు మాట్లాడుతూ గత 7 సం లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవని, 4 సం నుండి బదిలీలు లేవని, చాలా పాఠశాలల్లో ఖాళీలు ఉండడం వలన విద్య వ్యవస్థ కుంటు పడే అవకాశం ఉందన్నారు. కనుక వెంటనే ప్రమోషన్లు, బదిలీలు చేపట్టి ఖాళీలలో తాత్కాలికంగా విద్య వాలంటరీ లను నియమించాలని డిమాండ్ చేశారు. జీవో 317 అమలు వలన నష్టపోయిన ఉపాధ్యాయులకు సీనియారిటీ కల్పించాలని,  మెడికల్ గ్రౌండ్ తదితర అప్పిళ్లను వెంటనే పరిష్కరించాలని, పాఠశాలలు పారిశుద్ధ్యం కొరకు ప్రత్యేక సర్వీస్ పర్సన్ ను నియమించాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచాలని, అన్నారు. అదేవిధంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫారం పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో టిడబ్ల్యు టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉద్ధవ్, నాగేష్, బద్దిరావు, అరుణ్, హరి ప్రకాష్, భాస్కర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.