టి ఎన్ టి యు సి ఆధ్వర్యంలో నల్ల రిబ్బనుతో నిరసన తెలిసిన కార్మికులు

Published: Thursday May 27, 2021

మంచిర్యాల టౌన్, మే26, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సివిల్ డిపార్ట్మెంట్ ద్వారా సమావేశంలో లో సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టి ఎన్ టి యు సి అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా బొగ్గు పరిశ్రమ బహుళజాతి కంపెనీలకు సంస్థలకు దారాదత్తం చేస్తూ కార్మిక చట్టాలను కాలరాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే రక్షణ ఎల్ఐసి బ్యాంకింగ్ అను బొగ్గు పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయడం 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా మార్చడం 12 గంటల పని విధానాన్ని విధానం ప్రవేశపెట్టడం సీఎం పిఎఫ్ ఈపీఎఫ్ లో విలీనం చేయడం కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని హైపవర్ కమిటీ వేతనాలు కట్టి ఇవ్వాలని ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ మే 26న టి ఎన్ టి యు సి ఆధ్వర్యంలో కార్మికులు నల్ల రిబ్బను ధరించి విజయవంతం చేసినారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 24000 చెల్లించాలని గ్రాట్యుటీ పై సీలింగ్ తీసివేసి 1 ఇ 1 2017 నుండి ఇ 10 లక్షల పై గ్రాట్యుటీ సీలింగ్ తీసివేసి అధికారులకు 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే కార్మికులకు కూడా 11 2017 నుండి 10 లక్షల పై సీలింగ్ తీసివేసి 20 లక్షల రూపాయలు ఇవ్వాలనీ డిమాండ్ ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ఎస్సీ ఎల్ యు టి ఎన్ టి యు సి అధ్యక్షులు టి మనీ రామ్ సింగ్ జిల్లా అధ్యక్షులు అమానుల్లాఖాన్ ఏరియా ఆర్గనైజర్ ఆడెపు శ్రీనివాస్ ఎండి బుకుర్ రాజయ్య ఎండి హసన్ సిహెచ్ ప్రకాష్ అప్సర్ తదితరులు పాల్గొన్నారు.