రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్

Published: Friday November 25, 2022
* కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి

వికారాబాద్ బ్యూరో 24 నవంబర్ ప్రజాపాలన : కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ధరణి పోర్టల్, రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతుబంధు, పోడుభూముల సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు. వికారాబాద్ తహశీల్దార్ కార్యాలయం ప్రవేశ మార్గానికి అడ్డుగా బ్యానర్ కట్టి కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అధికార పార్టీ నేతలు సొంత ఆస్తులను కూడా పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఓటుకు నోటుతో గాలం వేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న అధికార పార్టీకి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తక్షణమే రైతుల భూ సమస్యలు, రైతు రుణమాఫీ, అర్హులందరికీ పింఛన్లు, రైతుబంధు, పోడుభూముల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం వికారాబాద్ మండల రెవెన్యూ అధికారికి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు రత్నారెడ్డి, శివారెడ్డి పెట్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్, జడ్పిటిసి మాజీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, వికారాబాద్ మండల కో ఆప్షన్ మెంబర్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎర్రవల్లి జాఫర్, ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ పెండ్యాల అనంతయ్య కాంగ్రెస్ కౌన్సిలర్లు జైదుపల్లి మురళి వేణుగోపాల్ రెడ్డి చాపల శ్రీనివాస్ ముదిరాజ్ నవీన్ తదితర నాయకులు పాల్గొన్నారు.