మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి

Published: Friday June 11, 2021

మధిర, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిరసిపిఐ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగిన ధర్నాతెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన మధిర పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో రెండో రోజు గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు బెజవాడ బాబు ఓట్ల కొండల్ రావు మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతమైన మధిరలో కరోనా విజృంభణ నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది పూర్తి స్థాయిలో లేకపోవడంతో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందక అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ఈ విషయమై ఫోన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన dm&ho తో మాట్లాడి వెంటనే ప్రభుత్వాసుపత్రికి డాక్టర్ను నియమిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతంగా మధిర ను గుర్తించిన ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక ఆస్పత్రిలోని నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగ కృష్ణ, చెరుకూరి వెంకటేశ్వరరావు, శ్రీను మంగళగిరి రామానుజన్, రమేష్, నాగేశ్వరరావు, కొండా నాయకర్ తదితరులు పాల్గొన్నారు.