ప్రభుత్వ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి.

Published: Friday December 16, 2022
పి.సి.సి.ఎఫ్, నోడల్ అధికారి మోహన్ చంద్ర పర్దేయన్
 
మంచిర్యాల బ్యూరో,   డిసెంబర్ 15, ప్రజాపాలన  :
 
అటవీ మళ్ళింపు సంబంధిత కార్యకలాపాల అమలు ప్రతిపాదనలను సమర్పించే సమయంలో నూతన నియమాలు, ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని పి.సి.సి.ఎఫ్, నోడల్ అధికారి మోహన్ చంద్ర పర్దేయన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా అటవీ అధికారులు, వివిధ సంబంధిత శాఖల అధికారులతో అటవీ మళ్ళింపు ప్రతిపాదనల ప్రక్రియ పురోగతి, రోడ్లు-భవనాలు, జాతీయ రహదారుల శాఖ, ఎం.ఐ.ఆర్.టి.హెచ్. రోడ్లు, పంచాయతీరాజ్, ఎల్.డబ్ల్యు. ఈ., సింగరేణి సంస్థల సంబంధిత 12 కేసులతో పాటు ఆప్టికల్ ఫైబర్ కేసులకు సంబంధించి 180 కంటే ఎక్కువ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పి.సి.సి.ఎఫ్, నోడల్ అధికారి మాట్లాడుతూ అటవీ పరిరక్షణ నియమాలలో మార్పులు చేయబడ్డాయని, మొదటి దశ క్లియరెన్స్, వివిధ ఏజెన్సీలు ఉల్లంఘనలను కలిగిన ప్రతిపాదనల ప్రాసెసింగ్ చెల్లుబాటుకు సంబంధించినవని, ఇందు వలన వివిధ శాఖలు, అటవీ శాఖల మధ్య సమన్వయ ప్రయత్నాలతో ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రతిపాదనలు రూపొందించడం అవసరమని, ఈ క్రమంలో నూతన నియమాలు, మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాళేశ్వరం సి.సి.ఎఫ్. వినోద్కుమార్, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లా అటవీ అధికారులు లావణ్య, కిష్టాగౌడ్, శివయ్య, ట్రాన్స్ కో ఈ. ఈ. రఘునందన్, మంచిర్యాల, చెన్నూర్ అటవీ డివిజనల్ అధికారులు సాహు, రమేష్, మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్ శేషరావు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జ్ఞానకుమార్, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.