ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి **మార్కెట్ కమిటీలో చిరుధాన్యాల గురించి అవగా

Published: Monday April 10, 2023

భారతీయ జనతా కిసాన్ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జక్క రవీందర్ రెడ్డి, అధ్యక్షతన  ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీలో ఆదివారం రైతులకు చిరుధాన్యాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బసవ పాపయ్య గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరిపల్లి అంజయ్య యాదవ్,  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లచ్చి రెడ్డి, ముత్యాల భాస్కర్ , కొత్త అశోక్ గౌడ్,  నాయిని సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ  రైతులు పండించే పంట సేంద్రియ ఎరువులతో పంట పండించాలని అదేవిధంగా దేశ ప్రజల ఆరోగ్యం బాగుండాలని చెప్పి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  రైతులను ఉద్దేశించి అదేవిధంగా  ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని అసెంబ్లీ కేంద్రాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పిన సందర్భంగా  ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రైతులు చిరుధాన్యాల గురించి జొన్నలు, సజ్జలు, రాగులు, అరికెలు, వదలు, పెసర్లు ఉలువలు, కందులు రైతులు పండించాలని వారికి తెలియజేయడం జరిగినది.ప్రజల ఆరోగ్య దృష్ట్యా గతంలో మన పెద్దలు జొన్నగట్కా సంకటి తిని, అంబలి తాగి ఆరోగ్యంతో 100 ఏళ్ళు బ్రతికి వారని కావున రైతులు అందరూ పండించే పంటలను సేంద్రియ ఎరువులతో పప్పు దినుసులు పండించాలని చెప్పి ఈ అవగాహన సదస్సులో రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరిగినది. ప్రజలు షుగర్తో, బీపీతో, బాధపడుతున్నారు. కావున వీటన్నిటిని కాపాడుకోవాలని రైతులందరూ పప్పు దినుసులు పండించాలని చెప్పి తెలియజేయడం జరిగినది. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో అన్ని అసెంబ్లీ కేంద్రాలలో ఇట్టి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నవారు సూరంపల్లి కాళిదాసు ,తాళ్ల వెంకటేష్ గౌడ్ ,మంచాల వైసీపీ ధన్య భాష , బూడిది నరసింహారెడ్డి ,విట్టల్ రెడ్డి ,శ్రీశైలం , పోచన్నమాల , శ్రీకాంత్ ,ముత్యాల మహేందర్ ,రాఘవేందర్ ,శ్రీశైలం ,అశోక్  మరియు తదితరు మండల నాయకులు,మున్సిపల్ నాయకులు,జిల్లా నాయకులు పాల్గొన్నారు.