గోపాల్ వాడలో బతుకమ్మ చీరల పంపిణీ

Published: Monday September 27, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 26, ప్రజాపాలన : మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని గోపాల్ వాడలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ ప్రారంబించారు. ఈ సందర్భంగా గోపాల్ వాడ, గాంధీనగర్ ప్రాంతాల్లో దాదాపు 600 మంది మహిళలకు దసరా కానుకగా బతుకమ్మ చీరలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ పంపిణీ చేశారు. అలాగే మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 12, 13, 14, 15, 16 వార్డులలో చీరల పంపిణి కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్, వార్డు కౌన్సిలర్ సల్ల మహేష్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.