పట్లూరు గ్రామ పాఠశాలను సందర్శించిన ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్

Published: Friday August 27, 2021
వికారాబాద్ బ్యూరో 26 ఆగస్ట్ ప్రజాపాలన : పాఠశాలలు సెప్టెంబర్ ఒకటి నుండి పునః ప్రారంభం అవుతాయని మర్పల్లి మండల ఎంపిడిఓ వెంకట్ రామ్ గౌడ్ తెలిపారు. గురువారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్, మొగిలిగుండ్ల, కొంశెట్ పల్లి గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో పాఠశాలలను సందర్శించి తగు సూచనలు చేశారు. పారిశుద్ధ్యం పనులలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని సర్పంచ్ కార్యదర్శులకు  తెలిపారు. పాఠశాల ఆవరణంలో నీళ్లు నిలుచున్న ప్రదేశంలో ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని టెక్నికల్ అసిస్టెంట్ విట్టల్ ను ఆదేశించారు. ఇట్టి విషయాన్ని సర్పంచ్ తో చర్చించి వెంటనే జెసిబితో దగ్గర ఉండి ఇంకుడు గుంత పనులు చేయిచడం జరిగిందని పేర్కొన్నారు. పాఠశాల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను పారిశుద్ధ కార్మికులతో తొలగించాలని కార్యదర్శికి చెప్పారు.  పాఠశాల చుట్టూ పేరుకుపోయిన నీచును తొలగించి  వైట్ వాషింగ్  చేయించాలని సర్పంచుకు వివరించారు. తరగతి గదులను శుభ్రపరిచి శానిటైజ్ చేయాలని ఉద్ఘాటించారు. పాఠశాలకు స్కావెంజర్ లేరని ఉపాధ్యాయురాలు ఎంపిడిఓ దృష్టికి తెచ్చారు. మరుగుదొడ్లు శుభ్రపరచుట కు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో వారానికి ఒక సారి శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శి సంతోషకు చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్లూరు సర్పంచ్ దేవరదేశి ఇందిరా అశోక్, ఎంపిటిసి సురేష్, ఎంఈఓ, టెక్నికల్ అసిస్టెంట్ విట్టల్ రావు పంచాయతీ కార్యదర్శులు, రాములు, అనిత, సంతోషలు పాల్గొన్నారు.